Chiranjeevi: క్లాస్‌ అయినా మాస్‌ అయినా బాస్‌ బ్రేక్‌ డ్యాన్స్‌ వేస్తే బాక్సులు బద్దలవ్వాల్సిందే..!

చిరు డ్యాన్స్‌ వేస్తే సినిమా థియేటర్లు దద్ధరిల్లిపోయేవి. 155 సినిమాల్లో 24వేలకు పైగా డ్యాన్స్‌ మూవ్స్ చేసిన చిరుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. చిరు కెరీర్‌లో అద్భుతమైన డ్యాన్స్ గురించి తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

author-image
By Archana
chiru11

megastar chiranjeevi

New Update

Megastar chiranjeevi: 156 సినిమాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులు.. ఇది చిరంజీవి ట్రాక్‌ రికార్డు మాత్రమే కాదు. ఇట్స్‌ ఆల్‌టైమ్‌ రికార్డు. అందుకే మెగాస్టార్‌ చిరంజీవి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. చిరంజీవి అంటేనే డ్యాన్స్.. డ్యాన్స్ అంటేనే చిరంజీవి.. ఈ విషయాన్నీ టాలీవుడ్‌లో ఎవరి ఫైన్‌ అయినా ఒప్పుకోని తీరాల్సిందే..! 1978లో తన తొలి సినిమా 'ప్రాణంఖరీదు'తో తెలుగు తెరపై మెరిశారు మెగాస్టార్‌. ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే తన తొలి సినిమా రిలీజ్ డేట్‌ రోజే చిరుకు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇక చిరంజీవి డ్యాన్స్‌  గురించి చెప్పుకోవాలంటే రోజులు పడుతుంది. ఈ స్థాయికి ఎదగడం కోసం ఆయన పడిన కష్టం ఎంతో టాలీవుడ్‌లో ఏ సినీ అభిమానిని అడిగినా గంటలపాటు చెబుతూనే ఉంటారు!

బ్రేక్-డ్యాన్స్ మూవ్‌లను పరిచయం చేసిన మెగాస్టార్ 

చిరంజీవి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు టాలీవుడ్‌లో గొప్ప డ్యాన్సర్లు ఎవరూ లేరు. ఎన్టీఆర్‌, కృష్ణ, శోభన్‌బాబు తమదైన శైలిలో స్టెప్పులు వేసేవారు. ఇటు ఏఎన్‌ఆర్‌కి సపరేట్ డ్యాన్స్‌ స్టైల్‌ ఉంది. అయితే చిరంజీవి వచ్చిన తర్వాత మాత్రం టాలీవుడ్‌ డ్యాన్స్‌ ముఖచిత్రమే మారిపోయింది. చిరంజీవి డ్యాన్స్‌ మూవ్స్‌ను చూడడం కోసమే థియేటర్స్‌కు వెళ్లేవారు నాటి సినీ లవర్స్‌. చిరు డ్యాన్స్‌లో గ్రేస్ ఉంటుంది.. ఆయన మూవ్‌మెంట్స్‌ పాటకు తగ్గటుగా ఉంటాయి. తెలుగు చిత్రాలలో బ్రేక్-డ్యాన్స్ మూవ్‌లను పరిచయం చేసిన మొదటి వ్యక్తి చిరంజీవినే. 

1983లో రిలీజైన ఖైదీ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతోనే చిరంజీవి సత్తా ఏంటో తెలుగు ప్రేక్షకులకు తెలిసి వచ్చింది. ఈ సినిమాని రగులుతుంది మొగలిపొద సాంగ్‌ సెన్సెషన్‌ క్రియేట్ చేసింది. ఈ పాటలో హీరోయిన్ మాధవితో కలిసి చిరు వేసిన స్టెప్స్ ట్రెండ్ సెట్‌ చేసింది. ఈ తరహా పాటను ఇమిటెట్‌ చేస్తూ తర్వాత ఎన్నో పాటలు వచ్చినా చిరు- మాధవీ గ్రేస్ ముందు ఏవీ నిలబడలేకపోవడం విశేషం. ఇక 1987లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన పసివాడి ప్రాణం సినిమాలో చిరు-విజయ్‌శాంతి స్టెప్పులను టాలీవుడ్‌ లవర్స్‌ ఎప్పటికీ మర్చిపోరు.

1988లో త్రినేత్రుడిలోని హే పాప అంటూ వచ్చే డ్యాన్స్‌లో చిరంజీవి మరోసారి తన బ్రేక్ డ్యాన్సింగ్ స్కిల్స్‌తో దుమ్మురేపాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా చేసిన భానుప్రియ నేచురల్‌గానే క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో చిరుతో సమానంగా స్టెప్పులు వేసి ఇరగదీశారు. 1992లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఘరానా మొగుడు చిరంజీవి ఇమేజ్‌ని ఎవరెస్ట్‌  రేంజ్‌కు తీసుకెళ్లింది. ఘరానా మొగుడులోని బంగారు కోడిపెట్ట సాంగ్‌లో చిరు వేసిన సాంగ్స్‌ నెవర్‌ బిఫోర్‌ ఎవర్ ఎగైన్!

చిరంజీవితో కలిసి పోటి పడే డ్యాన్స్‌ చేసే హీరోయిన్లు కూడా ఉన్నారు. రాధా, రాధిక, రంభ, విజయ్‌శాంతితో చిరు కాంబో అదిరిపోయేది. అయితే దిగ్గజ నటి శ్రీదేవితో కలిసి చిరు నటించిన జగదేకవీరుడు అతీలోక సుందరి సినిమాలో ఈ ఇద్దరి కాంబో టాలీవుడ్‌లో ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయింది. ఇక చిరు-లారెన్స్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1997లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన హిట్లర్ మూవీలో చిరు డ్యాన్స్‌ నెక్ట్స్‌ లెవల్‌. నడక కలిసిన నవరాత్రి సాంగ్ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఈ పాటకు కోరియోగ్రాఫర్ లారెన్స్‌.

2002లో రిలీజ్‌ అయిన ఇంద్ర సినిమా టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాలోని దాయి దాయి దామ్మ పాటలో చిరు వేసిన వీణ స్టెప్ కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసింది. లారెన్స్ కంపోజ్ చేసిన ఈ స్టెప్స్‌ను ఇమిటేట్ చేస్తూ చాలా మంది ఈ తరహా డ్యాన్స్‌ను ట్రై చేశారు. అయితే చిరు గ్రేస్‌ను టచ్‌ చేయాలేకపోయారు. అటు 2008లో చిరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత దశబ్దకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక ఖైదీ నంబర్‌ 150 ద్వారా రీఎంట్రీ ఇచ్చిన చిరు యూ అండ్ మీ సాంగ్‌లో షూకి లేసులు కడుతూ చిరు రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. ఇక 60 ప్లస్‌లోనూ చిరంజీవి తనలో గ్రేస్ తగ్గలేదని నిరూపించారు. ఇలా వయసు పెరిగినా చిరులో ఏ మాత్రం డ్యాన్స్ గ్రేస్ తగ్గలేదు. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ టాలీవుడ్‌లో డ్యాన్స్‌ అంటే చిరంజీవినే!

Also Read: Miss Universe India 2024: 18 ఏళ్ళకే మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. రియా సింఘా గురించి ఈ విషయాలు తెలుసా..?

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe