/rtv/media/media_files/2026/02/01/ram-charan-2026-02-01-14-56-19.jpg)
Ram Charan
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయనకు కవల పిల్లలు పుట్టిన విషయం తెలిసిందే. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టడంతో మెగా కుటుంబం అంతా ఆనందంలో మునిగిపోయింది. అభిమానులు కూడా ఈ శుభవార్తను ఘనంగా జరుపుకుంటున్నారు.
Ram Charan and Upasana are blessed with a baby boy and a baby girl.
— Anchor Pawan (@Pawannaidu_7344) February 1, 2026
First, a baby boy, followed by a baby girl after 2 minutes.
Heartiest congratulations to both of them.@AlwaysRamCharan@upasanakonidela#Chiranjeevi#RamCharan#UpasanaRamCharanpic.twitter.com/OQHVnPM6S3
అయితే, సినీ పరిశ్రమలో పనిచేసే డ్యాన్సర్ల కోసం ఆయన పెద్ద సహాయం ప్రకటించారు. తన సినిమాల్లో ఎన్నో పాటల్లో డ్యాన్సర్లతో కలిసి పనిచేసిన చరణ్, ఇప్పుడు వారి ఆరోగ్య భద్రత గురించి ఆలోచించారు.
డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ఉన్న సభ్యులందరికీ పూర్తి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. ఈ ఇన్సూరెన్స్ ఖర్చును పూర్తిగా రామ్ చరణ్ స్వయంగా భరిస్తున్నారు. ఈ పాలసీకి సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని సమాచారం.
సినీ రంగంలో వైద్య ఖర్చులు పెరుగుతున్న ఈ సమయంలో, డ్యాన్సర్లకు ఈ సహాయం చాలా ఉపయోగపడనుంది. తెరపై మాత్రమే కాదు, తెర వెనుక పనిచేసే వారి కోసం కూడా రామ్ చరణ్ చూపిన మనసు ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Follow Us