/rtv/media/media_files/2025/11/17/sai-dharam-tej-2025-11-17-10-14-29.png)
Sai Dharam Tej
Sai Durga Tej: మెగా ఫ్యామిలీలో మరో హీరో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. హీరో సాయి దుర్గా తేజ్/ సాయి ధరమ్ తేజ్ తాజాగా తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని రోజులుగా తన పెళ్లి పై వస్తున్న రూమర్స్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు తేజ్ మాట్లాడుతూ.. మంచి చిత్రాలు, మంచి జీవితాన్ని ప్రసాదించిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి తిరుమల వచ్చాను. వచ్చే ఏడాది నేను నటించిన సంబరాల 'ఏటిగట్టు' సినిమా విడుదలవుతుంది.. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని తెలిపారు. అనంతరం ఓ రిపోర్టర్ పెళ్లి పై వస్తున్న వార్తల గురించి ప్రశ్నించగా క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది తన పెళ్లి ఉంటుందని తెలిపారు. దీంతో మెగా ఫ్యామిలీలో మరో హీరో బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే శిరీష్ తన సింగిల్ లైఫ్ కి గుడ్ బై చెప్పేశాడు. హైదరాబాద్ కి చెందిన వ్యాపార వేత్త కూతురు నయనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. అక్టోబర్ 30న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య శిరీష్- నయనిక నిశ్చితార్థం జరిగింది.
Also Read: Aditi Rao Hydari: ఎవరూ నమ్మకండి.. అదంతా ఫేక్! అదితి షాకింగ్ పోస్ట్
Follow Us