Mask Movie: ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ 'కథాసుధ' అనే ఆంథాలజీ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘4 టేల్స్’ – 4 స్టోరీస్, 4 ఎమోషన్స్, 4 సండేస్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో దీనిని తెరకెక్కించారు. ఆంథాలజీ సిరీస్ అంటే( వివిధ కథల సమాహారం). ఇందులో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. వాటిలో మొదటి కథ 'మాస్క్' ఇప్పుడు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఎపిసోడ్ ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ ఆర్జీవీ, హరీష్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ లాంచ్ చేశారు. కిశోర్ గునానా, కోతపల్లి సురేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యంగ్ టాలెంట్ రావన్ రెడ్డి, నిట్టూరు చాందినీ రావు, మేఘన తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
The Mask a thrilling tale of secrets and suspense 😷😳
— ETV Win (@etvwin) October 12, 2025
Unmask the truth today!
Streaming NOW on @etvwin 🎬#TheMask#KathaSudha#ETVWinpic.twitter.com/HHUcZxQvT0
కథ ఏంటీ..
'మాస్క్' అనే కథను ఒక సస్పెన్స్ సర్వైవల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించారు. ఈ కథ అంతా కూడా ఒక రాత్రి చుట్టే తిరుగుతూ ఉంటుంది. క్రికెట్ బెట్టింగ్స్ లో డబ్బులు పోగొట్టుకున్న నివాస్ అనే యువకుడు.. అప్పులు తీర్చడానికి ఒక వృద్ధ దంపతులు ఉంటున్న ఇంట్లోకి దొంగతనానికి వెళ్తాడు. దొంగతనానికి వెళ్లిన నివాస్ కి అక్కడ ఒక మహిళా శవం కనిపిస్తుంది. తెల్లవారే సరికి అతడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అసలు మహిళను చంపింది ఎవరు? నివాస్ ఏమైనా ట్రాప్‌లో పడ్డాడా? ఆ ఇంటిలో డబ్బు ఉందని నివాస్‌కు ఎలా తెలిసింది? చివరికి నివాస్ ఈ హత్య నేరం నుంచి ఎలా బయటపడ్డాడు? అనే అంశాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.
Also Read: Bigg Boss Promo: రెచ్చిపోయిన రీతూ.. డెమోన్ పవన్ గప్ చుప్! నామినేషన్స్ లో రచ్చ రచ్చ!
Follow Us