/rtv/media/media_files/2025/09/18/manchu-manoj-2025-09-18-14-02-58.jpg)
Manchu Manoj
Manchu Manoj: టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘మిరాయ్’(Mirai Movie). కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ విజువల్ వండర్‌లో తేజ సజ్జా, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటించారు. సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఉత్తర అమెరికాలో 2 మిలియన్ డాలర్లు దాటి రికార్డు నమోదు చేసింది.
ఈ విజయం నేపథ్యంలో హీరో మంచు మనోజ్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన పోషించిన పాత్ర మహబీర్ లామా (Black Sword) ప్రేక్షకులపై భారీ ప్రభావం చూపింది. సినిమాలో ఆయన పాత్ర రాముని ఆధ్యాత్మిక శక్తి గల బాణంతో తగలబడిన తర్వాత కనిపించదు కానీ చనిపోయినట్లు స్పష్టంగా చూపించలేదు. దీంతో సీక్వెల్‌పై అంచనాలు మొదలయ్యాయి.
ఇంటర్వ్యూలో “మీరు ఆయనను చనిపోయినట్టు చూశారా?” అంటూ మనోజ్ మళ్లీ కనిపించే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. ఇది అభిమానుల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో మహబీర్ లామా తొమ్మిది అశోక గ్రంధాలను కూడగట్టి, వాటి శక్తిని పూర్తిగా గ్రహించకపోయినా, కొంత శక్తిని పొందుతాడు. ఇది అతడిని మానవుడికి మించిన శక్తిమంతుడిగా చేయగలేదు అన్నట్లు చూపించారు.
'మిరాయ్' సీక్వెల్ ట్విస్ట్..
ఇప్పుడు 'మిరాయ్' టీం ప్రస్తుతం ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తోంది. People Media Factory నిర్మించిన ఈ సినిమాకు సీక్వెల్ ప్లానింగ్ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు, దర్శకుడు కార్తిక్ గట్టమనేని త్వరలో మిరాయ్ సీక్వెల్ స్క్రిప్ట్‌పై పనిచేస్తారని టాక్ వినిపిస్తోంది.
ఇక, మహబీర్ లామా తిరిగి వస్తే ఏ రేంజ్ లో శక్తివంతుడుగా మారుతాడు అన్నది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ పాత్రలో మంచు మనోజ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌కి మంచి స్పందన వచ్చింది. కథలో అతని పాత్ర మిస్టరీగా ముగియడంతో, సీక్వెల్‌కి ఇది ఓ బలమైన హైప్‌ను తెచ్చిపెట్టింది.
మొత్తం మీద, మిరాయ్ విజయం టాలీవుడ్‌కు మరో పాన్ ఇండియా బ్రాండ్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు అందరి దృష్టీ మిరాయ్ 2పై ఉంది. మహబీర్ లామా పాత్ర మళ్లీ ఎంట్రీ ఇవ్వనుందా? అతడి అసలైన శక్తి ఏంటి? ఇవన్నీ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతున్న ప్రశ్నలు. సమాధానాల కోసం అందరూ మిరాయ్ సీక్వెల్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.