Manchu Manoj: మోహన్ బాబు, మంచు విష్ణు పై మనోజ్ కామెంట్స్ వైరల్!

మంచు మనోజ్ భావోద్వేగానికి గురైన సందర్భం 'భైరవం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చోటు చేసుకుంది. ఈ వేడుకపై మంచు కుటుంబం - మోహన్ బాబు, విష్ణు స్పందించకపోయినా, మనోజ్ మాత్రం భావోద్వేగానికి లోనై వారిని ఉద్దేశిస్తూ మాట్లాడాడు.

New Update

Manchu Manoj: 'భైరవం'(Bhairavam) సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా మనోజ్ పైన ప్రత్యేకంగా రూపొందించిన వీడియో ప్రదర్శించారు. ఆ విజువల్స్ చూసిన మనోజ్ ఒక్కసారిగా ఎమోషన్‌ను ఆపుకోలేక ఏడ్చేశాడు.

ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ..  “ఈ రోజుల్లో సొంత వారే పక్కన పడేస్తున్న సమయంలో, అభిమానులు నన్ను అమితంగా ప్రేమిస్తున్నారు” అంటూ తన మనసులోని భావాలను వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో కొన్ని నెగటివ్ ప్రచారాలు జరిగినప్పటికీ, నిజాయితీగా తనకు మద్దతుగా నిలుస్తున్న కొంతమంది మీడియా సంస్థలకూ ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

తన వ్యక్తిగత జీవితం ఎంత గందరగోళంగా ఉన్నా,  ధైర్యంగా ఉండటం వెనుక ఉన్న శక్తి అభిమానులే అని మనోజ్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన స్పీచ్ మొత్తం ఎమోషన్‌తో నిండిపోయింది. 

ఇకపై సినిమాలే నా జీవితం: మంచు మనోజ్(Manchu Manoj)

“ఇకపై సినిమాలే నా జీవితం. నా అభిమానులు నాకిచ్చే ప్రేమను ఇకపై వెండితెర మీద సినిమాల రూపంలో చెల్లించుకుంటాను” అంటూ మనోజ్ చెప్పిన మాటలు అక్కడున్న వారిని భావోద్వేగాన్ని గురిచేశాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు