/rtv/media/media_files/2024/12/14/D3ZvC7eKX6CMib6edtbu.jpg)
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన 'రాజాసాబ్' సినిమా చేస్తోంది. ఇటీవలే రాజాసాబ్ ట్రైలర్ విడుదలవగా.. అందులో ప్రభాస్ తో మాళవిక కెమిస్ట్రీ, గ్లామర్ డోస్ కుర్రకారును ఫిదా చేశాయి.
/rtv/media/media_files/2025/06/16/malavika-bangkok-trip-3rd-pic-706070.jpg)
ఈ సినిమా చేస్తుండగానే తెలుగులో మరో బంపర్ ఆఫర్ ఈ బ్యూటీకి దక్కినట్లు తెలుస్తోంది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందట.
/rtv/media/media_files/2024/12/17/uvzDlJFxh0I4jWFX8SRk.jpg)
'వాల్తేరు వీరయ్య' సినిమా తర్వాత చిరంజీవి- డైరెక్టర్ బాబీ కాంబోలో మరో క్రేజీ యాక్షన్ ఎంటర్ టైనర్ సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం మాళవిక పేరు పరిశీలనలో ఉందని సమాచారం.
/rtv/media/media_files/b888HCeZgCBjhOUmFT47.jpg)
అయితే ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటుండగా.. ఒక పాత్ర కోసం మాళవిక పేరు పరిశీలిస్తున్నారట. దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
/rtv/media/media_files/2024/12/14/bsjZ6sWXmy6hn9I00SfA.jpg)
ఒక వేళ ఇది నిజమైతే 'రాజాసాబ్' తర్వాత మాళవిక తెలుగులో నటించబోయే రెండో చిత్రం అవుతుంది.
/rtv/media/media_files/2024/12/17/MDySpp8fxx2OUe0JU4gG.jpg)
మాళవిక మలయాళ చిత్రం 'పట్టం పోలా' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత రజినీకాంత్ 'పేట', మాస్టర్, మారన్ వంటి సూపర్ హిట్ సినిమాలతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది.
/rtv/media/media_files/2024/12/17/epgtWPqaMKXtAFxN9QRP.jpg)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తరచూ నెట్టింట గ్లామరస్ ఫొటో షూట్లతో కుర్రకారును ఫిదా చేస్తుంది.