/rtv/media/media_files/2025/11/18/varanasi-2025-11-18-11-57-23.jpg)
Varanasi
Varanasi: ఇప్పుడు, రాజమౌళి(Rajamouli) కొత్త సినిమా 'వారణాసి' నుండి విడుదల చేసిన టీజర్ ఎన్నో ఆశల మధ్య సరికొత్త హైప్ క్రియేట్ చేసుకుంది. టైటిల్ అనౌన్స్‌మెంట్ లో భాగంగా విడుదలైన ఈ టీజర్ కోసం ఇండియన్ సినిమా అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తుండగా, ఇందులో ఒక్క డైలాగు కూడా లేకుండా రిలీజ్ చేసాడు రాజమౌళి. కాబట్టి అన్ని బాషల వారికీ ఈజీగా ఈ టీజర్ కనెక్ట్ అవుతోంది.
VARANASI to the WORLD
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అంతర్జాతీయంగా ఫేమస్ అయినా ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఉండటం వల్ల, ఈ టీజర్ రికార్డు సృష్టిస్తుందని అనుకున్న అభిమానులు భారీ వ్యూస్ ఆశించారు. అయినప్పటికీ, ఇప్పటివరకు అన్ని అధికారిక యూట్యూబ్ చానల్స్‌లో 20 మిలియన్స్ కు మించి ఎక్కువ వీక్షణలు రాలేదు.
ప్రస్తుతం, T-Series ప్రధాన చానల్‌లో 15 మిలియన్, T-Series Telugu 1.7 మిలియన్, T-Series Malayalam 2 లక్షలు, T-Series Tamil 6 లక్షల views మాత్రమే ఉన్నాయి. ఈ సంఖ్యలు కొంతమందికి తక్కువగా అనిపించవచ్చు. అయితే, నిజానికి ఈ అన్ని వ్యూస్ పూర్తిగా ఆర్గానిక్. రాజమౌళి టిమ్ వ్యూస్, లైక్స్ లేదా కామెంట్ల కోసం ఎలాంటి పేమెంట్ చేయలేదు.
కొన్ని తెలుగు సినిమాల పాటలు, ట్రైలర్లకు ఒక రోజు లో 40-50 మిలియన్ వ్యూస్ వస్తుంటాయి అయితే వ్యూస్ ని కొనుగోలు చేయడం వల్ల ఇలా జరుగుతుంది. చిన్న సినిమాలు కొన్ని పాటలకు 2 మిలియన్ వ్యూస్ కూడా రాబట్టారని చెబుతారు, ఇది నిజానికి అసాధ్యమే. ప్రస్తుతం ప్రేక్షకులు షార్ట్ ఫార్మ్ కంటెంట్ అంటే రీల్స్, చిన్న వీడియోలుపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
రాజమౌళి టీజర్ ద్వారా చూపిన కంటెంట్, క్రియేటివిటీ, నిజమైన మార్కెటింగ్ మీద ఆధారపడటం వల్ల వ్యూస్ కొంచెం తక్కువే వచ్చాయి అని చెప్పొచ్చు. ఇలాంటి నిజమైన, ఆర్గానిక్ వ్యూస్ పరిశ్రమకు ఒక కొత్త దిశను చూపిస్తుంది. ఇకపై ఎవరైనా పేమెంట్ చేయడం ద్వారా వ్యూస్ పెంచాలనుకునే ప్రయత్నాలు చేస్తే వారికి Varanasi టీజర్ ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది.
మొత్తం మీద, రాజమౌళి ఈ టీజర్ ద్వారా చూపిన ప్రయత్నం పరిశ్రమలో ఫేక్ వ్యూస్ పై అవగాహన పెంచుతోంది. అభిమానులు, ఇతర నిర్మాతలు ఇలా ఆర్గానిక్, కంటెంట్ ఆధారిత ప్రచారాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
Follow Us