Mahesh Babu: మహేష్ బాబు ఫ్యామిలీ నుండి కొత్త హీరోయిన్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..!

సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మహేశ్ బాబు మేనకోడలు జాన్వి ఘట్టమనేని హీరోయిన్‌గా ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. తల్లి మంజుల కలను నెరవేర్చుతూ నటనలో శిక్షణ తీసుకుంటున్నారు. ఆమె అందం, నటనతో ఇప్పటికే దర్శకుల దృష్టిని ఆకర్షించడం విశేషం.

New Update
Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మహేశ్ బాబు మేనకోడలు జాన్వి ఘట్టమనేని(Jaanvi Swarup) ఇప్పుడు సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. మహేశ్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని కూతురైన జాన్వి, తన తల్లి కలను నెరవేర్చడానికి తెరపై హీరోయిన్‌గా నటించడానికి సిద్ధమవుతోంది.

ఇప్పటికే ఇండస్ట్రీలో ఆమె ఎంట్రీపై మంచి చర్చ నడుస్తోంది. జాన్వి అందం మాత్రమే కాదు, ఆమె సాంప్రదాయ అందం అందరినీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా ఆమె ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu's Niece Jaanvi Swarup as Heroine

అయితే జాన్వి ఇప్పటివరకు మీడియాకి దూరంగా ఉండి, తన డెబ్యూ సినిమాకి పూర్తిగా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆమె రోజువారీ షెడ్యూల్‌లో ఫిట్‌నెస్ ట్రైనింగ్, డాన్స్ క్లాసులు, పెయింటింగ్, నటన వర్క్‌షాప్స్ ఉంటాయి. దర్శకులు ఆమె నటనను “మాటలకన్నా కళ్లతోనే భావాలను వ్యక్తం చేసే నేచురల్ యాక్ట్రెస్”గా పొగుడుతున్నారు.

తల్లి మంజుల ఘట్టమనేని, తన కూతురు సినీ రంగంలోకి రావడంపై చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో స్వయంగా నటించిన మంజుల, ఇప్పుడు తన కలను జాన్వి రూపంలో సాకారం అవుతుండటంతో గర్వంగా ఫీల్ అవుతున్నాని చెప్పుకొచ్చారు..

ఇండస్ట్రీలో ఇప్పటికే జాన్వి గురించి మంచి అంచనాలు ఉన్నాయి. ఆమెలో ఉన్న అందం, క్రమశిక్షణ, కళాత్మకత, నటనలో సహజత్వం ఇవన్నీ ఆమెను సూపర్ స్టార్ గా  నిలబెట్టగలవని మహేష్ బాబు ఫ్యాన్స్ అంటున్నారు. 

ఇంకా ఆమె డెబ్యూ సినిమా వివరాలు వెల్లడికాకపోయినా, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మహేశ్ బాబు కుటుంబం నుంచి మరో స్టార్ తెరపైకి వస్తుండటంతో అభిమానులు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు