HBD M. M. Keeravani: నాటు.. నాటు.. నాటు అంటూ తెలుగు సినిమా సంగీత ప్రపంచానికి ఆస్కార్ కీర్తిని తెచ్చి పెట్టారు.. ఆయన స్వరాలు తెలుగు ప్రేక్షకులను మైమరపించాయి. ఆయన స్వరపరిచిన పాటలు తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో తిరుగులేని దర్శకుడిగా వెలుగొందుతున్న ఎం.ఎం. కీరవాణి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి మరోసారి గుర్తుచేసుకుందాం..
Also Read:Tamannaah Bhatia: రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ.. స్టిల్స్ పిచ్చేక్కించేసిందిగా!
1990లో సంగీత దర్శకుడిగా కెరీర్
1990లో వచ్చిన "మనసు మమత" కీరవాణి స్వతంత్ర సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ సినిమా పాటలు బాగా హిట్ అయ్యాయి. అక్కడి నుంచి కీరవాణి ప్రస్థానం వేగంగా దూసుకుపోయింది. క్షణక్షణం, అన్నమయ్య, మగధీర, ఈగ, బాహుబలి వంటి ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఆయన స్వరాలు తెలుగు ప్రేక్షకులను మైమరపించాయి. ఆయన పాటల్లో కొత్తదనం, మనసుకు హాయినిచ్చే మధురానుభూతిని కనిపిస్తుంటుంది.
ఆస్కార్ విజేతగా RRR మలుపు
"RRR" సినిమాతో ఆయన జీవితంలో ఒక అద్భుతమైన మలుపు వచ్చింది. ఈ సినిమాలోని "నాటు నాటు" పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావడం తెలుగు సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది. కీరవాణి ఆస్కార్ వేదికపై నిలబడి అవార్డు అందుకున్నప్పుడు, ప్రతి తెలుగువాడు గర్వపడ్డాడు. ఇది ఆయన వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, తెలుగు సినిమా సంగీతానికి దక్కిన గౌరవంగా భావించారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/07/04/mm-keeravani-2025-07-04-10-52-49.png)
కీరవాణి కేవలం సంగీత దర్శకుడు మాత్రమే కాదు, ఒక మంచి మనిషి. ఆయన నిరాడంబరత, వినయం అందరికీ ఆదర్శం. ఆయన ఎప్పుడూ నేర్చుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకే ఆయన సంగీతం ఎప్పుడూ తాజాగా, కొత్తగా అనిపిస్తుంది.
Also Read: Honey Rose: ఆరంజ్ కలర్ డ్రెస్‌లో బాలయ్య హీరోయిన్ కొత్త లుక్ .. వైరలవుతున్న వీడియో