Lokesh Kanagaraj: అంతా నాశనం నాశనమైంది! 'కూలీ' లీక్ పై లోకేష్ పోస్ట్

రజినీకాంత్ 'కూలీ' మూవీ సెట్స్ నుంచి లీకైన నాగార్జున వీడియోపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందించారు. "ఒక్క రికార్డింగ్ కారణంగా ఎంతో మంది రెండు నెలల పాటు పడిన కష్టం వృధా అయ్యింది. దయచేసి ఇలాంటివి చేయొద్దు అని xలో పోస్ట్ పెట్టారు".

New Update
coolie

coolie

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'కూలీ'. ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ సెట్స్ నుంచి లీకైన నాగార్జునకు సంబంధించి ఓ యాక్షన్ సీన్ వీడియో నెట్టింట తెగ వైరలైంది. ఇందులో నాగార్జున సేమ్ 'డాన్' మూవీలో మాదిరిగా స్టైలిష్ వైట్ కోట్ ధరించి చేతిలో సుత్తి పట్టుకొని శత్రువును దారుణంగా కొడుతున్నట్లుగా కనిపించింది. దీని వల్ల సినిమాలో నాగార్జున ఎలా కనిపించబోతున్నారు? అనే సస్పెన్స్ ప్రేక్షకులలో లేకుండా పోయింది. అయితే దీనిపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందించారు.

అంతా నాశనం అయ్యింది!

వీడియో లీక్‌పై లోకేష్ నిరాశను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. "ఒక్క రికార్డింగ్ కారణంగా రెండు నెలల పాటు ఎంతో మంది పడిన కష్టం అంతా వృధా అయిపొయింది. దయచేసి ఇలాంటివి చేయకండి. ఇటువంటి పనుల వల్ల ప్రేక్షకులలో సినిమా మొత్తం సినిమా ఫీల్ ను పాడుచేస్తుంది. ప్రతి ఒక్కరిని నేను వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను.. ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. కూలీ సినిమాలో నాగార్జున 'సైమన్' అనే పాత్రలో నటిస్తున్నారు. 

ఇక ఈ సినిమా తర్వాత రజినీకాంత్ మరో సినిమా లైన్ లో ఉంది. టిజె జ్ఞానవేల్ దర్శకత్వంలో  'వెట్టయన్' సినిమా చేస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి,  మంజు వారియర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు