Little Hearts Collections:  చిన్న సినిమా పెద్ద హిట్.. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతోంది!

చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది 'లిటిల్ హార్ట్స్' సినిమా! స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ లేకపోయినా కథ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువైంది.

New Update

Little Hearts Collections:  చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది 'లిటిల్ హార్ట్స్' సినిమా! స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ లేకపోయినా కథ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. సోషల్ మీడియా ఫేమ్ మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా సెప్టెంబర్ 5న విడుదలైన ఈ  సినిమాకు యువత నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఘాటీ, మదరాశి వంటి బడా సినిమాలను సినిమాలను సైతం వెనక్కి నెట్టేసి బాక్సాఫీస్ వద్ద విజయ పరంపర కొనసాగిస్తోంది. మొదటి రోజు ఈ చిత్రం రూ. 1.7 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. రెండవ రోజు వసూళ్లు గమనీయంగా పెరిగాయి. రెండవ రోజు రూ. 3 కోట్ల వసూళ్లు రాబట్టింది.

సుమారు రూ. 2 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిలాభాల బాట పట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వసూళ్ళలో గమనీయమైన పెరుగుదల చూస్తుంటే..  సినిమా లాంగ్ థియేట్రికల్ రన్ని కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఈరోజు వీకెండ్ కావడంతో సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇండియాలో మాత్రమే కాదు ఓవర్ సీస్ లోనూ సత్తాచాటుతోంది ఈ చిత్రం. కొన్ని చోట్ల స్టార్ హీరోల సినిమాలను కూడా దాటేసి కలెక్షన్లు రాబట్టింది. USAలో ఈ చిత్రం 171K డాలర్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

బడా సినిమాలను వెనక్కి నెట్టేసి 

మరోవైపు అదే రోజు విడుదలైన  స్టార్ హీరోయిన్ అనుష్క 'ఘాటీ' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా తొలిరోజు కేవలం రూ. 2.36 కోట్లతో పూర్ ఓపెనింగ్స్ సాధించింది. రెండవ రోజు దీని వసూళ్లు మరింత పడిపోయాయి. మొదటి రోజు రూ. 2 కోట్లు ఉండగా.. రెండవ రోజు రూ. 1.8 కోట్లకు పడిపోయాయి. నెగెటివ్ రివ్యూస్, మౌత్ టాక్ కారణంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దెబ్బతింది. 'ఘాటీ' తో పాటు శివకార్తికేయన్  'మదరాశి'  కూడా బాక్సాఫీస్ వద్ద బాగా కష్టపడుతోంది. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ్ తో పాటు  తెలుగులోకి కూడా  డబ్ అయ్యి విడుదలైంది.  మొదటి రోజు రూ. 1.8 కోట్ల గ్రాస్ వసూలు చేయగా..  రెండో రోజు ఇంకా తగ్గింది. అలాగే తమిళ్లో కూడా ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు. మొత్తానికి  'లిటిల్ హార్ట్స్' సినిమా చిన్నదయినా.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని సౌత్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. 

Also Read:SSMB29 Rajamouli: కెన్యా మంత్రిని కలిసిన రాజమౌళి.. 120 దేశాల్లో! SSMB29 కోసం భారీ ప్లానింగ్

Advertisment
తాజా కథనాలు