'లాపతా లేడీస్‌' చిత్రానికి నిరాశ.. ఆస్కార్ బరి నుంచి అవుట్ !

ఆస్కార్ నామినేషన్స్ కు ఎంపికైన 'లాపతా లేడీస్‌' చిత్రానికి నిరాశ ఎదురైంది. తాజాగా ఆస్కార్ అకాడమీ ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్ చిత్రాల జాబితాను విడుదల చేయగా.. అందులో 'లాపతా లేడీస్‌' చోటు దక్కించుకోలేకపోయింది. దీంతో సినీ ప్రియులు నిరాశకు గురయ్యారు.

New Update

ఆస్కార్ లో దక్కని చోటు.. 

అయితే తాజాగా అకాడమీ ఆస్కార్ కు  షార్ట్‌ లిస్టయిన చిత్రాల జాబితాను ప్రకటించింది. కాగా ఈ జాబితాలో  ‘లాపతా లేడీస్‌’  చోటు దక్కించుకోలేకపోయింది. ఆస్కార్ కోసం  'లాపతా లేడీస్‌' చిత్రబృందం ఎంతో శ్రమించారు. క్యాంపెయిన్ లో భాగంగా టోరంటో ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, పలు చోట్ల సినిమాను ప్రదర్శించారు.  దర్శకురాలు కిరణ్‌రావు, అమీర్ ఖాన్ బాలీవుడ్ మీడియాలకు అనేక  ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ.. ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో  ‘లాపతా లేడీస్‌’ లేకపోవడంతో సినీప్రియులు నిరాశకు గురయ్యారు. 

ఈ చిత్రంలో స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే   ‘లాపతా లేడీస్‌’  ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ Obviously అవార్డు వేడుకల్లో ఈ చిత్రం ఉత్తమ క్రిటిక్ ఛాయిస్ విభాగంలో  ఉత్తమ చిత్రంగా నిలిచింది. 2001 బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన కథ  'లాపతా లేడీస్'. ఆడవారి పట్ల సమాజం చూపించే వివక్ష.. కట్టుబాట్లు, ఆచారాలు , కుటుంబ గౌరవం అనే పేరుతో ఆడవాళ్ళు ఎలా అణచివేతకు గురవుతున్నారు అనే అంశాలను ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు. 

ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో సంతోష్.. 

అయితే  ఆస్కార్ 2025కి UK పంపిన భారతీయ హిందీ ఫిల్మ్ 'సంతోష్'  ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో స్థానం సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో భారతీయ నటి షహనా గోస్వామి ప్రధాన పాత్రలో నటించడం అందరినీ  దృష్టిని ఆకర్షిస్తోంది.  బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 

Also Read:  2024లో ప్రపంచాన్ని వణికించిన భయంకరమైన వ్యాధులివే.. ఇందులో మీకు ఏదైనా సోకిందా?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు