/rtv/media/media_files/2025/11/05/monalisa-2025-11-05-16-48-40.jpg)
Monalisa
Monalisa: కుంభమేళాలో తన అందమైన చూపులతో, పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన మోనాలిసా ఇప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా అడుగుపెట్టారు. ఆమె నటిస్తున్న మొదటి సినిమా టైటిల్ ‘లైఫ్’. సాయి చరణ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. శ్రీ వెంగమాంబ క్రియేషన్స్ బ్యానర్‌పై అంజయ్య నిర్మిస్తుండగా, సినిమాకు దర్శకత్వం శ్రీను కోటపాటి వహిస్తున్నారు.
‘లైఫ్’ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పూజా కార్యక్రమం నిర్వహించగా, నటుడు సురేష్ క్లాప్ కొట్టారు. నిర్మాత డీఎస్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా కొత్త సినిమా విజయవంతం కావాలని ఆశించారు.
కుంభమేళా #Monalisa టాలీవుడ్ హీరోయిన్ గా గ్రాండ్ launch pic.twitter.com/2mYtYG3ORE
— Suresh Kondeti (@santoshamsuresh) November 5, 2025
ప్రారంభోత్సవం అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్మాత అంజయ్య మాట్లాడుతూ “ఈరోజు మా సినిమా ‘లైఫ్’ను ప్రారంభించాం. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. కుంభమేళాలో పాపులర్ అయిన మోనాలిసాతో సినిమా చేస్తే మంచి క్రేజ్ వస్తుందని భావించాం. దర్శకుడు చెప్పిన కథ విన్నాక మోనాలిసా పాత్రకు బాగా సరిపోతుందని అనిపించింది. ఈ కథ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీవితంలో జరిగే నిజమైన సంఘటనల ఆధారంగా సాగుతుంది. ప్రారంభోత్సవానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు,” అన్నారు.
హీరో సాయి చరణ్ మాట్లాడుతూ “దర్శకుడిని కలిసిన రోజు నుంచే నేను ఈ పాత్రకు సరిపోతానని చెప్పారు. ‘లైఫ్’ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే కథతో వస్తోంది. ఇందులో మంచి సందేశం ఉంది. ప్రేక్షకులు తప్పక ఇష్టపడతారు,” అని తెలిపారు.
హీరోయిన్ మోనాలిసా మాట్లాడుతూ “తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ రావడం కూడా ప్రత్యేకమైన అనుభవం. ఇప్పుడే తెలుగు రాదు కానీ త్వరలో నేర్చుకుంటా. నా తొలి సినిమా ‘లైఫ్’ అందరికీ మంచి లైఫ్ ఇస్తుందని ఆశిస్తున్నాను. దర్శకుడు, నిర్మాతలకూ ధన్యవాదాలు,” అని తెలిపారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీవిత కథను ఆధారంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రం, మోనాలిసా అందం, క్రేజ్‌తో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.
Follow Us