Kamal Hasan: స్టార్ హీరో కమల్ హాసన్ పై కేసు!

కమల్ హాసన్ పై కేసు నమోదైంది. ఇటీవలే కన్నడ పుట్టింది తమిళం నుంచే' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశాయి. ఈ మేరకు కర్ణాటక రక్షణ వేదిక సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

New Update
case filed against kamal hasan

case filed against kamal hasan

 Kamal Hasan: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో దుమారం రేపుతున్నాయి. ఇటీవలే చెన్నై లో తన రాబోయే సినిమా  'తగ్ లైఫ్' ఆడియో రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ..  "కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది" అని అన్నారు. దీంతో వివాదం చెలరేగింది. కర్ణాటకకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, నెటిజన్లు కమల్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. 

కమల్ హాసన్ పై కేసు 

తాజాగా కమల్ వ్యాఖ్యలపై కర్ణాటక రక్షణ వేదిక (Karnataka Rakshana Vedike - KRV)  అనే ప్రో కన్నడ సంఘం పోలీస్ కేసు నమోదు చేసింది.  బెంగళూరులోని  ఆర్.ఎం.నగర్ పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు నమోదైంది.  కమల్ వ్యాఖ్యలు కన్నడ భాషను, కన్నడ ప్రజల మనోభావాలు దెబ్బతీశాయని.. ఆయన పై చర్యలు తీసుకోవాలని సంఘం నేతలు కోరారు. ఈ మేరకు KRV అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి మాట్లాడుతూ.. ఇలాంటి వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉంటాయి. ఇవి చట్టవిరుద్ధమైనవి" అని  అన్నారు.

ఇదిలా ఉంటే  కమల్ హాసన్ వ్యాఖ్యల పై  రాజకీయ రంగంలోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య .. "బీచారా కమల్ హాసన్" అంటూ స్పందించగా, ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక .. "ఆయన మానసిక రోగి" అని ఘాటుగా విమర్శించారు. 

మరోవైపు  కమల్ హాసన్ మాత్రం ఈ  వివాదాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు. తాను ప్రేమతో మాత్రమే అలా అన్నానని.. అందులో ఎటువంటి ఉద్దేశం లేదని తెలిపారు.  భాష గురించి మాట్లాడే అర్హత తనతో పాటు ఏ రాజకీయ నాయకులకు లేదని అన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు