/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
KGF Actor: కేజీఎఫ్ సినిమాలో డాన్ శెట్టి పాత్రలో అలరించిన నటుడు దినేష్ మంగళూరు కన్నుమూశారు. పలు కథనాలు ప్రకారం, దినేష్ ఈరోజు తెల్లవారుజామున ఉడిపి జిల్లా కుందాపూర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. గత ఐదు రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. దినేష్ మృతి పట్ల సినీ తారలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. సీనియర్ దర్శకుడు పి. శేషాద్రి ఆయన మరణ వార్తను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
#DineshMangalore , who played "Shetty" alongside #Yash in #KGF , is no more... #RIP#OmShanti#YashBoss#ToxicTheMovie#Toxicpic.twitter.com/9qHvqGQtL1
— Always Bollywood (@AlwaysBollywood) August 25, 2025
సినిమాలు..
దినేష్ కన్నడలో 'వీర మదకరి', 'చంద్రముఖి ప్రాణసఖి', 'నం. 73 శాంతినివాస', కేజీఎఫ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కేజీఎఫ్ 2లో బాంబే డాన్ గా ఆయన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. 'హరికతే అల్లా గిరికతే', 'రణవరు కందంటే', 'కిరిక్ పార్టీ', 'ఎలో జగప్ప నిన్న ప్యాలెస్', 'భువనమ్ గగనం' వంటి చిత్రాలలో సహాయక నటుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఆర్ట్ డైరెక్టర్ గా కెరీర్
కుందాపూర్‌లో జన్మించిన నటుడు దినేష్ చాలా కాలంగా బెంగళూరులో
నివసిస్తున్నారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ శశిధర్ అడపా వద్ద సహాయకుడిగా దినేష్ సినీ కెరీర్‌ను ప్రారంభించాడు. మొదట ఆర్ట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ చేసి.. ఆ తర్వాత నటుడిగా ఎదిగాడు. అప్పటివరకు అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన దినేష్ టిఎస్ నాగభరణ దర్శకత్వం వహించిన 'జనుమద జోడి' సినిమాతో స్వతంత్ర ఆర్ట్ డైరెక్టర్ గా ఎదిగాడు. టుడు దినేష్ కు భార్య భారతి, ఇద్దరు కుమారులు పవన్, సజ్జన్ ఉన్నారు.
Also Read: Child Artist: "100% లవ్" బుడ్దోడు ఇప్పుడు ఎంత హ్యాండ్సమ్ అయ్యాడో చూస్తే షాక్! ఆ సినిమాతో ఎంట్రీ