/rtv/media/media_files/2025/11/06/kalyani-priyadarshan-pic-seven-2025-11-06-20-09-47.jpg)
ప్రస్తుతం తమిళ్లో వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో భారీ ప్రాజెక్టులో బాగమైనట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
/rtv/media/media_files/2025/11/06/kalyani-priyadarshan-pic-one-2025-11-06-20-09-47.jpg)
గతేడాది బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన 'కల్కి 2898 AD' సీక్వెల్ లో కళ్యాణి బంపర్ ఆఫర్ పట్టేసినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే 'కల్కి' నుంచి దీపికను సైడ్ చేసినట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె స్థానంలో ఎవరు నటించబోతున్నారంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.
/rtv/media/media_files/2025/11/06/kalyani-priyadarshan-pic-three-2025-11-06-20-09-47.jpg)
మొదట్లో దీపికా స్థానంలో అలియా భట్, సాయి పల్లవి, అనుష్క పేర్లు వినిపించాయి. అయితే తాజా అప్డేట్ ప్రకారం.. దీపికా పాత్ర కోసం కల్యాణి ప్రియదర్శన్ పేరు పరిశీలనలో ఉన్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.
/rtv/media/media_files/2025/11/06/kalyani-priyadarshan-pic-two-2025-11-06-20-09-47.jpg)
ఈ నేపథ్యంలో తాజాగా కళ్యాణి ప్రియదర్శిని ఈ రూమర్ల పై స్పందించింది.
/rtv/media/media_files/2025/11/06/kalyani-priyadarshan-pic-one-2025-11-06-20-09-47.jpg)
''కొందరు అదేపనిగా యాక్టర్స్ గురించి ఏదో ఒకటి చెబుతూనే ఉంటారనుకుంటా? ఏదేమైనా కల్కి పాత్ర కోసం నా పరిశీలిస్తున్నారంటే నాకు సంతోషమే! కానీ వాళ్ళు ఎవరిని ఫైనల్ చేశారు? ఎవరిని తీసుకోబోతున్నారు అనేది చెప్పడం మాత్రం కష్టం'' అంటూ రిప్లై ఇచ్చింది.
Follow Us