Kajal Aggarwal: "ఐ యామ్ సేఫ్" తప్పుడు వార్తల పై కాజల్ క్లారిటీ..

కాజల్ అగర్వాల్‌కి యాక్సిడెంట్ అయ్యిందని సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు ఫేక్ అని ఆమె ఖండించారు. తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానని, ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మకూడదని తెలిపారు. ప్రస్తుతం ఆమె "ఇండియన్ 3", "రామాయణ"లో నటిస్తునట్లు సమాచారం.

New Update
Kajal Aggarwal

Kajal Aggarwal

Kajal Aggarwal: టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌పై సోమవారం (సెప్టెంబర్ 8) సోషల్‌మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. ఆమెకు యాక్సిడెంట్ అయ్యిందనీ, ఆరోగ్యం విషమంగా ఉందనీ కొన్ని వార్తలు వచ్చాయి. దీంతో కాజల్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎంతోమంది ఆమెకు మెసేజ్‌లు పెట్టడం, ట్వీట్లు చేయడం చేశారు.

ఈ వార్తలపై కాజల్ అగర్వాల్ స్వయంగా స్పందించారు. మంగళవారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో క్లారిటీ ఇచ్చారు. తాను పూర్తిగా బాగానే ఉన్నానని, తప్పుడు వార్తలు ఎవరో ఫేక్‌గా సృష్టించారని స్పష్టం చేశారు.

ఇలాంటి వార్తలను నమ్మొద్దు..

“నాకు యాక్సిడెంట్ అయిందని వార్తలు వస్తున్నాయ్‌. వాటిని చూసి నేను నవ్వుకున్నా. ఇవన్నీ పూర్తిగా అసత్యం. దేవుడి దయతో నేను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నాను. దయచేసి ఇలాంటి వార్తలను నమ్మొద్దు, షేర్ చెయ్యొద్దు” అని తెలిపారు. ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇక ఆమె ఇటీవల మంచు విష్ణు ప్రధాన పాత్రలో వచ్చిన "కన్నప్ప" సినిమాలో పార్వతీ దేవిగా కనిపించారు. ఆ పాత్ర ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆమె కమల్ హాసన్‌తో కలిసి "ఇండియన్ 3" సినిమాలో నటిస్తున్నారు. అంతేకాదు, "రామాయణ" చిత్రంలో కూడా ఆమె నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి, కాజల్‌ అగర్వాల్‌కు యాక్సిడెంట్ జరిగినట్టు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. ఫేక్ న్యూస్‌లను నమ్మకూడదని, అలాంటి విషయాలను షేర్ చేయకూడదని కాజల్ తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు