Johnny Master తో టార్చర్.. రేప్ కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్! ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. అతని దగ్గర పని చేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్ కొంతకాలంగా జానీ మాస్టర్ తనపై లైంగిక వేదింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. By Archana 16 Sep 2024 | నవీకరించబడింది పై 16 Sep 2024 10:23 IST in సినిమా ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి Johnny Master : ఢీ షో ద్వారా ఒక సాధారణ కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టిన జానీ మాస్టర్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది స్టార్ కొరియోగ్రాఫర్ ఎదిగాడు. తన భిన్నమైన కొరియోగ్రఫీ స్టైల్ జానీని ప్రత్యేకంగా నిలబెట్టింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీస్ లో స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూ కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తున్నాడు. ఇటీవలే 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక సినిమాలతో పాటు మరోవైపు జనసైనికుడిగా రాజకీల్లోనూ చురుకుగా పాల్గొంటున్నాడు. జానీ మాస్టర్ పై లైంగిక వేదింపుల కేసు జానీ కెరీర్ ఇలా సక్సెస్ ఫుల్ గా సాగుతున్న క్రమంలో.. అతని పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. అతని దగ్గర పనిచేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ కొంతకాలంగా తనపై లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. అవుట్‌డోర్ షూటింగ్ కోసం చెన్నై, ముంబై సహా ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తనపై అత్యాచారం చేసాడని ఆరోపించింది.అంతే కాదు హైదరాబాద్ నార్సింగిలోని ఆమె నివాసంలో కూడా జానీ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపింది. మహిళా ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జానీపై కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు తదుపరి విచారణ కోసం కేసు నార్సింగ్ పోలీసులకు బదిలీ.. చేయగా అతనిపై ఐపిసి సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506), స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2), (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి చేశాడని నమోదైన కేసుకు సంబంధించి మేడ్చల్ స్థానిక కోర్టు జానీకి 6 నెలలు శిక్ష విధించింది. Also Read: Chiranjeevi: వరద బాధితుల కోసం సీఎం రేవంత్ రెడ్డికి రూ. కోటి చెక్కు! #tollywood మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి