Allu Arjun: బాధితురాలికి అండగా బన్నీ.. వైరల్ అవుతున్న వీడియోలు!

జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు విషయంలో బాధితురాలికి అండగా అల్లు అర్జున్ నిలిచారనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. గీతా ఆర్ట్స్ నిర్మించే ప్రతి సినిమాలో ఆమెకు పని కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

New Update
allu arjun

allu arjun

Allu Arjun: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం ఇండస్ట్రీలో దూమారం రేపుతోంది. ఆయన దగ్గర పని చేసే అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ తనపై జానీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు జానీ పై IPC 376, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జానీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలకు, ఎన్నో హిట్ పాటలు కంపోజ్ చేశారు. ఈ క్రమంలో ఆయన పై లైంగిక ఆరోపణలు రావడం తెలుగు చిత్రపరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

బాధితురాలికి అండగా అల్లు అర్జున్ 

అయితే ఈ కేసు విషయంలో బాధితురాలికి అండగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆరోపణల కారణంగా బాధితురాలు భవిష్యత్తులో పని చేసుకోవడానికి ఇబ్బంది పడకుండా బన్నీ ఆమెకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై తాను నటించే చిత్రాలతో పాటు తన సొంత బ్యానర్ గీత ఆర్ట్స్ పై నిర్మించే ప్రతి సినిమాలో అవకాశాలు కల్పిస్తామని తన టీమ్ ద్వారా అల్లు అర్జున్ తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. నిన్న జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ లో కూడా కమిటీ సభ్యురాలు జాన్సీ కూడా మాట్లాడుతూ.. ఓ పెద్ద హీరో బాధితురాలికి పని విషయంలో భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఈ భరోసా ఇచ్చిన పెద్ద హీరో మరెవరో కాదు అల్లు అర్జునే అన్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

సినీ ఇండస్ట్రీలో ఒక అమ్మాయి ఇలాంటి లైంగిక ఆరోపణలను బయట పెట్టిన తర్వాత.. ఆమెకు ఇక ఎలాంటి అవకాశాలు రావు, ఆమె కెరీర్ మొత్తం పోయినట్లే అని అనుకుంటారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ బాధితురాలికి అండగా నిలిచారనే వార్త ఆయనను మరో స్థాయికి తీసుకెళ్లింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ TFI మంచిగా ఉండాలి అని కోరుకునే మనుషుల్లో అల్లుఅర్జున్ మొదటగా ఉంటాడు అంటూ.. గతంలో పలు ఈవెంట్లలో తెలుగు ఇండస్ట్రీ కోసం బన్నీ మాట్లాడిన వీడియోలను షేర్ చేస్తూ ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు