/rtv/media/media_files/2025/11/17/jigris-movie-2025-11-17-11-22-15.jpg)
jigris movie
JIGRIS: యంగ్ టాలెంట్ రామ్ నితిన్, కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా ప్రధాన పాత్రలో నవంబర్ 14న విడుదలైన 'జిగ్రీస్' చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా థియేటర్స్ లో ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇటు సోషల్ మీడియా, అటు సినీ విశ్లేషకులు నుంచి మంచి రివ్యూస్ వినిపిస్తున్నాయి. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ నటనతో ఆకట్టుకున్నారు.
కృష్ణ నటనకు ప్రశంసలు
ముఖ్యంగా హీరో కృష్ణ బూర్గుల ఆనియన్స్ తో పాటు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. సినిమా అంతా ఒక 'చిచోర్' పాత్రలో కనిపించిన కృష్ణ, తనదైన కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించాడు. సినిమాను తన భుజాలపై నడిపించాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాలో అతడి డిఫరెంట్ స్లాంగ్, నటన ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ కృష్ణ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
విడుదలకు ముందే మాట..
అయితే కృష్ణ సినిమా విడుదలకు ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన పాత్ర గురించి సంచలన ప్రకటన చేశాడు. 'జిగ్రీస్' సినిమా ప్రేక్షకులను మెప్పించకుంటే తాను నటన మానేస్తానని.. 'డీజే టిల్లు', 'జాతి రత్నాలు' మాదిరిగా నవ్విస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీనికి తగ్గట్లే 'జిగ్రీస్' సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే సినిమాలో కృష్ణ నటన ఆడియన్స్ తో పాటు విమర్శకులను కూడా ఫిదా చేసింది.
నటుడు కృష్ణ రవిబాబు దర్శకత్వం వహించిన 'క్రష్' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత దిల్ రాజు నిర్మించిన 'ATM' వెబ్ సీరీస్, 'కృష్ణమ్మ' వంటి చిత్రాల్లో నటించి అలరించాడు. ఇప్పుడు 'జిగ్రీస్' సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి సపోర్ట్ గా నిలిచారు. మూవీ ప్రమోషన్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొని కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంతో కృషి చేశారు.
Also Read: Allu Arjun: ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ ఫోన్ వాల్‌పేపర్.. మార్చి 27, 2026 అంటే ఏంటి..?
Follow Us