.@Kiran_Abbavaram launches the ultimate friendship & travel anthem from #Jigris#ThirigeBhoomi – Every trip has a story, every story has a song ! pic.twitter.com/ippfJg2N9s
— Rajesh Manne (@rajeshmanne1) August 29, 2025
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్
రీసెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా టీజర్ లాంచ్ చేయగా సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. యూత్ టార్గెట్ గా టీజర్ లోని డైలాగ్స్, సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. నలుగురు స్నేహితులు కలిసి ఒక పాత మారుతి 800 కారులో రోడ్ ట్రిప్ వెళ్లగా.. ఆ ప్రయాణంలో వారి సరదా సన్నివేశాలు, ఎమోషన్స్ నేపథ్యంలో ఈ కథ ఉండబోతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
డెబ్యూ డైరెక్టర్ హరీష్ రెడ్డి ఉప్పుల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్ పై కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నారు. కామ్రన్ సయ్యద్ సంగీతం అందిస్తున్నారు. చైతన్య రెడ్డి తూరుపు ఎడిటింగ్ బాధ్యతలు వహిస్తుండగా.. ఈశ్వర ఆదిత్య సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
మ్యాడ్ స్క్వేర్, ఈనగరానికి ఏమైంది తరహలో 'జిగ్రీస్ ' కూడా మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా మూవీ టీజర్ చూసి సినిమా పై నమ్మకం వ్యక్తం చేశారు. అంతే కాదు ఈ సినిమాతో రామ్ నితిన్ ఖాతలో మరో బ్లాక్ బస్టర్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఖాయమని అనుకుంటున్నారు ప్రేక్షకులు. జిగ్రీస్ లో రామ్ నితిన్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్ ప్లే చేశాడు.
Follow Us