Jani Master: లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కు ఊహించని షాక్..!

లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కు ఊహించని షాక్ ఎదురైంది. నార్సింగి పోలీసులు అతనిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం జానీ లడఖ్‌కు పారిపోయినట్లు తెలుస్తోంది.

Jani Master
New Update

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది. అతని దగ్గర పని చేసే అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ జానీ పై లైంగిక ఆరోపణల కేసు పెట్టడం ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీపై పోలీసులు IPC 376, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు

అయితే తాజాగా జానీ మాస్టర్ కేసులో మరో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. అతని పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ వేధింపులకు పాల్పడ్డాడని తెలియడంతో పోక్సో కేసు పెట్టారు. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న జానీ ప్రస్తుతం లడఖ్ లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి జానీ కోసం వేట మొదలు పెట్టారు.

ఇప్పటికే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జానీ మాస్టర్ పై వస్తున్న లైంగిక ఆరోపణల పై ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో కమిటీ సభ్యులు జాన్సీ, తమ్మారెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. ఐదేళ్ల పాటు ఆ అమ్మాయి నరకం చూసిందని. తను 16 నుంచి 21 ఏళ్ళ వరకు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉందని తెలిపారు. ఆ అమ్మాయి యూనియన్ కార్డు తీసుకొని బెదిరించి వేధింపులకు పాల్పడ్డాడని. యువతి తల్లిదండ్రుల నుంచి కూడా సమాచారం సేకరించాం.. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి జానీ మాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ పేర్కొంది

#jani-master
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe