Pawan Kalyan: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Jadcharla MLA Anirudh Reddy) పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ముందుగా ఒక నటుడేనని, ఆయన రాజకీయ ప్రయాణం కూడా సినిమాల మాదిరిగానే సాగుతోందని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ రాజకీయంగా గెలవాలంటే ఎప్పుడూ ఎవరో ఒకరి మద్దతు అవసరమని అనిరుధ్ రెడ్డి విమర్శించారు. ఆయన సొంత బలంతో రాజకీయాల్లో నిలబడలేరని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారని, ఒక్క సీటు కూడా గెలవలేకపోయారని గుర్తు చేశారు.
అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని “నిర్మాత”గా, నారా లోకేష్‌ను “కో-ప్రొడ్యూసర్”గా పెట్టుకుని గెలిచారని సెటైర్లు వేశారు. అయినా కూడా మంత్రి పదవితో పవన్ కళ్యాణ్ సంతృప్తి చెందడం లేదని, ఇప్పుడు తెలంగాణ వైపు దృష్టి పెట్టారని అన్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీని కొత్త “నిర్మాత”గా చూసుకుని, తెలంగాణలో తన రాజకీయ సినిమా మొదలుపెట్టాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ ప్రజలపై చేసిన వ్యాఖ్యలను కూడా అనిరుధ్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల కళ్లు మంచివి కావని పవన్ కళ్యాణ్ అన్నారని, అలాంటి మాటలు అన్న వ్యక్తిని ఇక్కడి ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అలాంటి పార్టీ నుంచి తెలంగాణలో అభ్యర్థులు ఎలా పోటీ చేస్తారని నిలదీశారు.
తెలంగాణలో భూముల ధరలు పెరగడమే ఆంధ్రా నాయకులు ఇక్కడికి రావాలని చూస్తున్న కారణమని ఆయన ఆరోపించారు. అందుకే ఏదో ఒక కారణం చెప్పుకుని తెలంగాణలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.
పవన్ కళ్యాణ్‌ను “ప్యాకేజీ స్టార్” అంటూ విమర్శించిన అనిరుధ్ రెడ్డి, ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి రావడం ఒక భారీ బడ్జెట్ సినిమా లాంటిదని వ్యాఖ్యానించారు. భారీ ఖర్చుతో తీసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతాయని, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయత్నం కూడా తెలంగాణలో అలాగే విఫలమవుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని, తమ భూములు, హక్కుల విషయంలో తామే తగిన సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కేవలం ఒక 'ప్యాకేజీ స్టార్' తెలంగాణ ఎమ్మెల్యే సెటైర్లు..
పవన్ కళ్యాణ్‌పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజకీయాలను సినిమాలతో పోలుస్తూ, ఇతరుల మద్దతుతోనే పవన్ గెలిచారని విమర్శించారు. తెలంగాణలో ఆయన రాజకీయ సినిమా ఫ్లాప్ అవుతుందని జోస్యం చెప్పారు.
Pawan Kalyan