/rtv/media/media_files/2025/11/17/ibomma-issue-2025-11-17-12-56-42.jpg)
Ibomma Issue
Ibomma Issue: ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లకు సంబంధించి ఇటీవల జరిగిన అరెస్ట్ ఘటన అందరికి తెలిసిందే. హైదరాబాద్ పోలీసులు ఆ వెబ్‌సైట్ల నిర్వాహకుడిని, ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తన చేతనే ఈ పిరసీ వెబ్‌సైట్లను మూసివేయించారు. అప్పటి నుండి, ఐబొమ్మ వెబ్‌సైట్ యాక్సెస్ చేయాలనుకున్నవారికి అది ఓపెన్ కాలేదు. ఓపెన్ అవ్వకపోగా వెబ్‌సైట్‌లో ఒక ప్రత్యేక సందేశం కనిపించి అందరిని షాక్ కు గురి చేసింది.
"మీకు గతంలో మా గురించి బాగా తెలిసి ఉండొచ్చు లేదా మా సేవలను ఉపయోగించి ఉండవచ్చు. కానీ మీకు ఓ చెడు వార్త - మా సర్వీసులు మీ దేశంలో పర్మనెంట్‌గా నిలిపివేస్తున్నాం. మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించమని కోరుతున్నాం." అని మెసేజ్ దర్శనమిచ్చింది.
ఇమ్మడి రవి విశాఖపట్నం వాసి. అతను కరీబియన్ ద్వీపాల్లో నివసిస్తూ తెలుగు సినిమాల మాస్టర్ కాపీలు దొంగతనం చేసి, వాటిని పైరసీ వెబ్‌సైట్లలో పోస్టు చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. హైదరాబాద్‌లో అతను మూడు కోట్ల విలువ చేసే ప్రైయివేట్ నివాసాన్ని కూడా కొన్నాడు.
ఇతర వ్యక్తిగత కారణాల కారణంగా భార్యతో విడాకులు తీసుకున్న ఇమ్మడి రవి, భారతదేశానికి వచ్చి, ఐబొమ్మ, బప్పం టీవీ వంటి పైరసీ వెబ్‌సైట్లను నడిపించడం ప్రారంభించాడు. అతని భార్య పోలీసులకు వాస్తవాలు వెల్లడించడంతో, పోలీసులు కూకట్‌పల్లి ప్రాంతంలోని అతని నివాసంలో అతన్ని అరెస్ట్ చేశారు.
ఈ ఘటన తర్వాత, ఐబొమ్మ, బప్పం టీవీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. వెబ్‌సైట్ యూజర్లు ఇప్పుడు ఈ సర్వీసులను యాక్సెస్ చేయలేరు. ఈ దశలో పోలీసులు పైరసీ కంటెంట్ వ్యాప్తిపై కచ్చితమైన చర్యలు తీసుకుంటున్నారని కూడా తెలుస్తోంది.
ఈ సంఘటన, సినిమా, సీరియల్‌ల పైరసీ వెబ్‌సైట్లను ఉపయోగించడం ప్రమాదకరమే కాబట్టి, యూజర్లకు ఒక స్పష్టమైన హెచ్చరికగా నిలిచింది. అధికారులు ఇలాంటి వెబ్‌సైట్లను ఉపయోగించవద్దని జాగ్రత్తలు సూచిస్తున్నారు.
Follow Us