Smita Sabharwal: మంత్రి సురేఖ సమంత గురించి చేసిన వ్యాఖ్యలపై IAS అధికారి స్మిత సబర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఈ సమాజంలో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మహిళలను ఒక క్లిక్ బైట్‌లుగా.. సంచలనాలకు థంబ్‌నెయిల్స్ గా ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో అధికారులను కూడా వదిలి పెట్టడం లేదు. ఇదంతా నేను నా వ్యక్తిగత అనుభవం నుంచి మాట్లాడుతున్నాను. మహిళలను, కుటుంబాలను, సామజిక నిబంధనలను గౌరవిద్దాం. గౌరవప్రదమైన ఒక మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూసి షాకయ్యాను. అంతా రాజకీయాల కోసమే కాదు.. ప్రజా జీవితంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించుకుందాం అంటూ మంత్రి సురేఖకు చురకలు అంటించారు స్మిత."
కొండా సురేఖ ఏమన్నారంటే..?
బుధవారం మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో అక్కినేని నాగార్జున, సమంత, నాగచైతన్య పేర్లను ప్రస్తావిస్తూ.. కేటీఆర్ వల్లే సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కినేని కుటుంబం, సమంతతో సహా పలువురు సినీ ప్రముఖులు సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎదుటివారి వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి తీసుకురావడం ఏ మాత్రం సరికాదని మండిపడ్డారు.
ఇది ఇలా ఉంటే మంత్రి కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యల పై క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేశారు. "నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ, సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా..నా వ్యాఖ్యల కారణంగా మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు.
Also Read: నాగార్జున ఫ్యామిలీని రోడ్డుపైకి లాగడానికి కారణం అదే.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!