/rtv/media/media_files/2025/01/05/QkotoMcFHkAc2hKQvh7B.jpg)
rose Photograph: (rose )
మలయాళ నటి హనీ రోజ్ సంచలన పోస్ట్ పెట్టింది. తనను ఓ బిజినెస్ మెన్ వెంబడిస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఆమె ఫేస్‌బుక్ లో పోస్ట్ పెట్టారు. గతంలో అ వ్యక్తి నిర్వహించిన ఈవెంట్ కు తాను హాజరు కాలేదని అప్పటినుంచి అతడు ప్రతీకారంగా తన వెంటపడుతూ, సోషల్ మీడియాలోనూ తన పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాడంటూ తెలిపారు. తాను ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షమవుతున్నాడని ఆమె పేర్కొన్నారు. అతడిపై చట్టపరంగా పోరాడుతా అంటూ వెల్లడించారు.
ఎవరైనా స్త్రీని అవమానించవచ్చా
డబ్బు దురహంకారంతో ఎవరైనా స్త్రీని అవమానించవచ్చా దీనికి మన న్యాయవ్యవస్థలో ఆడవారికి ప్రత్యేక రక్షణ కల్పిస్తే బాగుండు అని హనీ రోజ్ అభిప్రాయపడింది. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న తాను అతని వేధింపులను ఎందుకు సహించాలంటూ హనీ పోస్ట్ చేసింది. దీనిపై ఎర్నాకులం సెంట్రల్ పోలీసులకు హనీ రోజ్ ఫిర్యాదు చేశారు. అయితే ఆ బిజినెస్ మెన్ ఎవరన్నది మాత్రం హనీ రోజ్ బయటపెట్టలేదు. సోషల్ మీడియాలోనూ తనను ఎగతాళి చేస్తున్న వారికి వార్నింగ్ ఇస్తూ నటి హనీ రోజ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
వీరసింహారెడ్డి చిత్రంతో కంబ్యాక్
2008లో ఆలయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హనీ రోజ్. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. ఆ తరువాత తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చి మలయాళంలోనే సినిమాలు చేసుకుంది. 2023 లో వచ్చిన బాలయ్య వీరసింహారెడ్డి చిత్రంతో కంబ్యాక్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడు పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రాచెల్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇందులో హనీ ఊరమాస్ లుక్‌లో కనిపించనుంది.
Also Read : ట్రెండింగ్లో ఓయో రూమ్స్.. దివాలా తీయడం ఖాయమట!
Also Read : రైతు భరోసా విధానాలేంటి.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనా!
Follow Us