BIG BREAKING: ప్రముఖ నటుడు కన్నుమూత!

ప్రముఖ హాలీవుడ్ నటుడు  టెరెన్స్ స్టాంప్ 87 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు స్వయంగా తెలియజేశారు.  టెరెన్స్ స్టాంప్ 1980 లో వచ్చిన  సూపర్ మ్యాన్ చిత్రంలో  విలన్ 'జనరల్ జోడ్' పాత్రకు ప్రసిద్ధి చెందారు. 

New Update
BREAKING NEWS

breaking news

BIG BREAKING: ప్రముఖ హాలీవుడ్ నటుడు  టెరెన్స్ స్టాంప్ 87 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు స్వయంగా తెలియజేశారు. టెరెన్స్ మరణానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయన మరణ వార్త అభిమానులను, సినీ తారలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. హాలీవుడ్ సినీ చరిత్రలో ఆరు దశాబ్దాల పాటు సాగిన ఆయన సినీ కెరీర్ ఎంతో మందిని ప్రభావితం చేసింది. 'సూపర్ మ్యాన్' వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు.  1980లో వచ్చిన  'సూపర్ మ్యాన్' చిత్రంలో  విలన్ 'జనరల్ జోడ్' పాత్రతో బాగా పాపులర్ అయ్యారు. 

 సినీ కెరీర్ 

 1962లో "బిల్లీ బడ్" సినిమాతో సినీ కెరీర్ ని ప్రారంభించిన టెరెన్స్ తొలి సినిమాతోనే  ఆస్కార్ నామినేషన్ పొందారు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించారు. 1965లో విలియం వైలర్ దర్శకత్వంలో వచ్చిన "ది కలెక్టర్" సినిమాలో ఆయన నటనకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు.

జనరల్ జోడ్ పాత్రతో ప్రసిద్ధి 

టెరెన్స్ తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ "సూపర్ మ్యాన్" (1978) మరియు "సూపర్ మ్యాన్ II" (1980) సినిమాల్లోని 'జనరల్ జోడ్' పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఇందులో ఆయన పోషించిన విలన్ పాత్ర ఐకానిక్ విలన్లలో ఒకటిగా నిలిచిపోయింది.  "ఫార్ ఫ్రమ్ ది మ్యాడింగ్ క్రౌడ్",  "స్టార్ వార్స్: ది ఫాంటమ్ మెనస్"  సినిమాలోని పాత్రలు కూడా ఆయనకు మంచి పేరు తెచ్చాయి. 

ఫ్యాషన్ ఐకాన్ 

నటుడిగా మాత్రమే కాకుండా గ్లామర్ ప్రపంచంలోనూ సెపరేట్ ఐడెంటిటీటీ క్రియేట్ చేసుకున్నారు. ఆయన  స్టైల్, అందమైన రూపం, టెరెన్స్  ని ఫ్యాషన్ ఐకాన్  గా మార్చాయి. బ్రిటన్ గ్లామరస్  స్టార్లలో ఒకరిగా   పేరు పొందారు.  అప్పట్లో టెరెన్స్   సూపర్ మోడల్ జీన్ ష్రింప్టన్‌తో  ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది.

విభిన్న పాత్రలు 

స్టాంప్ ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలకే పరిమితం కాలేదు. స్టీవెన్ సోడర్‌బర్గ్ దర్శకత్వంలో వచ్చిన "ది లైమీ" (1999) లో ఆయన ఒక క్రూరమైన  క్రిమినల్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. అలాగే  "ది అడ్వెంచర్స్ ఆఫ్ ప్రిస్సిల్లా, క్వీన్ ఆఫ్ ది డెసర్ట్" సినిమాలో  ట్రాన్స్‌జెండర్ మహిళ  పాత్ర ఆయన చేసిన  సాహసోపేతమైన పాత్రలలో ఒకటి.  ఇది  ఆయన నటనలోని వైవిధ్యాన్ని చూపించింది. స్టాంప్ తన సినీ కెరీర్ లో  పీర్ పాలో పసోలిని, కెన్ లోచ్, ఎడ్గర్ రైట్ వంటి స్టార్ దర్శకులతో కలిసి పనిచేశారు.

రచయితగా కూడా

నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా కూడా గుర్తింపు పొందారు స్టాంప్.  బ్రీథింగ్ అండ్ యాక్టింగ్", "స్టాంప్ ఆల్బమ్",  "రేర్ స్టాంప్స్: రిఫ్లెక్షన్స్ ఆన్ లివింగ్  వంటి అనేక పుస్తకాలు రాశారు. 

Advertisment
తాజా కథనాలు