Suhas Mandadi: రూటు మార్చిన సుహాస్.. 'మండాడి'తో తొలిసారి ఆ రికార్డ్!

సుహాస్ తొలిసారి “మండాడి”తో తమిళ్లో అడుగుపెడుతున్నారు. సముద్రం నేపథ్య యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో సూరి హీరోగా నటిస్తుండగా, సుహాస్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. రూ.75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌లో విడుదల చేయనున్నారు.

New Update
Suhas Mandadi

Suhas Mandadi

Suhas Mandadi: తెలుగు నటుడు సుహాస్ తన కెరీర్‌ను సరికొత్త కొత్త దిశలో తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో విభిన్న కథలను ఎంచుకుని నటించిన ఆయన, ఇప్పుడు తమిళంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన తమిళ తొలి చిత్రం “మండాడి”. ఇది సముద్రం నేపథ్యంగా సాగే యాక్షన్ డ్రామా.

ఈ సినిమాలో తమిళ నటుడు సూరి హీరోగా నటిస్తున్నారు. హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించిన సూరి, తరువాత హీరోగా మారి మంచి విజయాలు సాధించారు. ఇప్పుడు ఆయన చేస్తున్న పెద్ద ప్రాజెక్ట్ ఇదే. “మండాడి” సూరి కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా అని తెలుస్తోంది. దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తీస్తున్నారు.

Also Read: ఏం హారర్ భయ్యా..! ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ 'ఈషా' ఎంట్రీ

ఈ సినిమాకు మతిమారన్ పుహళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌ఎస్ ఇన్ఫోటెయిన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మాణం జరుగుతోంది. కథ సముద్ర తీరంలో జరిగే జాలర్ల బోటు పందేల చుట్టూ తిరుగుతుంది. ఇందులో సూరి జాలరి పాత్రలో కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ఆయన శారీరకంగా చాలా శ్రమించి కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు.

సుహాస్ ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. కథలో ఆయన పాత్ర చాలా ముఖ్యమని సమాచారం. ఈ పాత్ర తనకు తమిళ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తీసుకొస్తుందని సుహాస్ నమ్మకం వ్యక్తం చేశారు. యాక్షన్, నటనకు ప్రాధాన్యం ఉన్న ఈ సినిమా కావడంతో తాను కొత్తగా కనిపిస్తానని అంటున్నారు సుహాస్.

Also Read: ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. హీరోల్లో ఒకే ఒక్కడు!

ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ స్థాయి స్టంట్ నిపుణులతో కలిసి ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ రూపొందించారు. ముఖ్యంగా బోట్లపై జరిగే పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయని యూనిట్ తెలిపింది. సంగీతాన్ని జి. వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు.

ఇక సుహాస్ నటించిన తెలుగు చిత్రం “హే బల్వంత్” కూడా ఈరోజు ఫిబ్రవరి 20న విడుదలైంది. ఒకవైపు తెలుగులో, మరోవైపు తమిళంలో ఇలా బిజీగా ఉన్న సుహాస్, “మండాడి”తో తమిళ ప్రేక్షకుల్లో బలమైన గుర్తింపు సంపాదించాలని చూస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్‌లో విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు