Eesha OTT: ఏం హారర్ భయ్యా..! ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ 'ఈషా' ఎంట్రీ

శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు హారర్ థ్రిల్లర్ “ఈషా” థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంది. సైన్స్, మూఢనమ్మకాలు, ఆత్మల నేపథ్యంతో భయపెట్టిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో “Isha” పేరుతో స్ట్రీమింగ్ అవుతోంది.

New Update
Eesha OTT

Eesha OTT

Eesha OTT: టాలీవుడ్‌లో చిన్న సినిమాల ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పెద్ద అంచనాలు లేకుండా థియేటర్లకు వచ్చి మంచి విజయాలు సాధిస్తున్న సినిమాలు ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హారర్ థ్రిల్లర్ చిత్రం “ఈషా” కూడా మంచి గుర్తింపు పొందింది.

ఈ సినిమాకు శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించగా, త్రిగుణ్ (ఆదిత్ అరుణ్), అఖిల్ రాజ్, సిరి హనుమంతు, పృథ్వీరాజ్, మైమ్ మధు వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మించారు. సంగీతాన్ని ఆర్ ఆర్ ధృవన్ అందించారు.

హారర్ సినిమాలు తెలుగులో ఎక్కువగా రావు. అలాంటి సమయంలో వచ్చిన “ఈషా” ప్రేక్షకులను నిజంగానే భయపెట్టింది. సినిమా కథ సైన్స్, మూఢనమ్మకాలు, ఆత్మల చుట్టూ తిరుగుతుంది. మొదటి నుంచి చివరి వరకు టెన్షన్ ఫీలింగ్ ఇస్తూ కథ సాగుతుంది. థియేటర్లలో చూసిన వారికి కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ధృవన్ ఇచ్చిన నేపథ్య సంగీతం భయాన్ని మరింత పెంచింది.

ఈ సినిమా విడుదలైనప్పుడు కొంత నెగిటివ్ మిక్స్డ్ టాక్  వచ్చినప్పటికీ, చాలా మంది ప్రేక్షకులు హారర్ ఎలిమెంట్స్ ను మెచ్చుకున్నారు. చిన్న సినిమా అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఐఎండీబీలో కూడా ఈ చిత్రానికి 9.3 రేటింగ్ రావడం ఆశ్చర్యం కలిగించింది.

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో విడుదలైన దాదాపు ఎనిమిది వారాల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను “ఈషా” అని కాకుండా “Isha” అని సెర్చ్ చేయాలి. పేరు స్పెల్లింగ్ మార్చడంతో కొంతమంది ప్రేక్షకులు కంఫ్యూజ్ అయ్యారు.

మొదట ఈ సినిమా విదేశాల్లో మాత్రమే స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు భారత్‌లో కూడా ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ చిత్రం ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి.

హారర్ సినిమాలు ఇష్టపడే వారికి, ఇంట్లో కూర్చొని భయాన్ని ఆస్వాదించాలని అనుకునేవారు “ఈషా” ను ఇప్పుడు ఓటీటీలో చూసేయొచ్చు.

Advertisment
తాజా కథనాలు