ZEBRA: దీపావళి కానుకగా సత్యదేవ్ 'జీబ్రా'...! నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జీబ్రా'. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అక్టోబర్ 13న తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. By Archana 18 Sep 2024 in సినిమా Short News New Update Zebra Movie షేర్ చేయండి ZEBRA: సత్యదేవ్ తెలుగులో 'గాడ్సే', 'జ్యోతి లక్ష్మి', 'పిట్ట కథలు', 'క్షణం' వంటి సినిమాలతో నటుడిగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా సినిమాల్లో ఆయన వాయిస్ మాడ్యులేషన్ కు సెపెరేట్ ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పాలి. కేవలం హీరోగానే కాదు పలు సూపర్ హిట్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు సత్యదేవ్. రీసెంట్ గా యాక్షన్ డ్రామా 'కృష్ణమ్మ' సినిమాతో ప్రేక్షకులను అలరించిన సత్యదేవ్.. తాజాగా మరో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'జీబ్రా' సస్పెన్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి అశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ - పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై SN రెడ్డి , S పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ ధనంజయ, సత్యరాజ్, సునీల్ వర్మ, సత్య అక్కల, జెనిఫర్ పిచినాటో తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా తాజాగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జీబ్రా అక్టోబర్ 13న దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'జీబ్రా' రిలీజ్ డేట్ జీబ్రా అక్టోబర్ 13న దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా చేస్తూనే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు సత్యదేవ్. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో 'ఫుల్ బాటిల్', క్రాంతి బాల దర్శకత్వంలో 'గరుడ చాప్టర్ 1' చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి