Maremma Glimpse: హీరో రవితేజ అన్న కుమారుడు మాధవ్ భూపతి రాజు హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. మాచర్ల నాగరాజు దర్శకత్వంలో 'మారెమ్మ' సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. అయితే నేడు మాధవ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి చిన్న గ్లిమ్ప్స్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో మాధవ్ గుబురు గడ్డంతో మాస్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు.
Happy birthday @maadhav_9999 🤗
— Ravi Teja (@RaviTeja_offl) September 15, 2025
All the best ra for #Maremma 🔥 pic.twitter.com/UvZApYCEHJ
'మారేమ్మ' ఒక గ్రామీణ నేపథ్యం కలిగిన పల్లెటూరి యాక్షన్ డ్రామాగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవికతకు దగ్గరగా ఉండేలా దీనిని చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఇందులో మాధవ్ మాధవ్ లుంగీ కట్టిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి సినిమానే అయినప్పటికీ మాధవ్ తెరపై అద్భుతమైన ఆరాను ప్రదర్శించారు. పూర్తిగా రగ్గడ్ అవతార్‌తో, మాస్ గా కనిపిస్తూ తన పాత్రలో ఒదిగిపోయారు. ఈ గ్లింప్స్ వీడియోలో మాధవ్ కబడ్డీ మైదానంలోకి నడుచుకుంటూ వెళ్లే సన్నివేశం అదిరిపోయింది. ఇది అతని నటనను, పాత్ర స్వభావాన్ని తెలియజేస్తోంది. మంచాల నాగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో మాధవ్ ఒక యాక్షన్ స్టార్‌గా మారడానికి సిద్ధంగా ఉన్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. అతని నటన, పాత్ర ఇంటెన్సిటీ 'మారేమ్మ' సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.
Also Read: Horror Movie: ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న హారర్ మూవీ! ఒక్క సీన్ కూడా వదలరు!