పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పండగలాంటి న్యూస్. సినిమా విడుదల తేదీని మూవీ టీం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. విజయవాడలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో సినిమా షూట్ ప్రారంభమైంది. 

New Update
Hari hara veera mallu

గత కొన్ని నెలల నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల షుటింగ్‌లకు కాస్త దూరంగా ఉన్నారు. దీంతో కొత్త సినిమాలకు సైన్ చేయలేదు. అయితే పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోగా.. జ్యోతికృ‌ష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ పీరియాడికల్ యాక్షన్ మూవీ. ఈ చిత్రం షుటింగ్‌ ఈరోజు నుంచి మొదలుపెట్టినట్లు సోషల్ మీడియా ద్వారా మేకర్స్ ప్రకటించారు. 

సినిమా వచ్చేది అప్పుడే?

ఇప్పటికే విడుదల అయిన గ్లింప్స్, టీజర్ సినిమా అంచనాలను పెంచేశాయి. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తూ.. మూవీ టీం రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 28వ తేదీన పార్ట్-1 ను విడుదల చేస్తున్నట్లు ఎక్స్ ద్వారా చిత్ర యూనిట్ తెలిపింది. పవన్ కెరీర్‌లో ఇదే మొదటి ప్యాన్ ఇండియా మూవీ. దీనిని మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఏంఎం రత్నం నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది. పవన్ బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రయూనిట్ విజయవాడలో మూవీ సెట్‌ వేసింది. అందులో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతుందని.. షుటింగ్‌కి పవన్ కళ్యాణ్ కూడా వచ్చారని మూవీ టీం తెలిపింది. 

Advertisment
తాజా కథనాలు