Saripodhaa Sanivaaram: నాని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ 'సరిపోదా శనివారం'. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 26న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

New Update
Saripodhaa Sanivaaram

Saripodhaa Sanivaaram

Saripodhaa Sanivaaram: వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'.  డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీలో కన్నడ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ ఫీమేల్ లీడ్ గా నటించగా.. ఎస్. జే సూర్య పవర్ ఫుల్ విలన్ గా నటించారు. ఆగస్టు గత నెల 29న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఎస్. జే సూర్య రోల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రిలీజైన 20 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక ఈ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. 

సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్ 

సరిపోదా శనివారం ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈనెల 26 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ ఇండియా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ, భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.  

ఈ సినిమా తర్వాత నాని మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్ 3' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా  వచ్చే ఏడాది మే 1న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఆ తర్వాత 'దసరా'  డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో మరో మూవీ సైన్ చేశారు. దీనితో పాటు 'బలగం'  వేణుతో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. 

Also Read: Saripodhaa Sanivaaram: "సరితూగే సమరమే, సంహారం తథ్యం".. ఎస్‍. జే సూర్య బర్త్ డే స్పెషల్..!

Advertisment
తాజా కథనాలు