Dhanush: ధనుష్ 52వ చిత్రం 'ఇడ్లీ కడై'.. పోస్టర్ వైరల్..!

ధనుష్ తన స్వీయ దర్శకత్వంలో నాల్గవ చిత్రాన్ని ప్రకటించారు. ధనుష్ 52 వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని 'ఇడ్లీ కడై' అనే టైటిల్ తో అనౌన్స్ చేశారు. ధనుష్ సొంత బ్యానర్ బ్యానర్ వండర్‌బార్ ఫిల్మ్స్‌, డాన్ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

New Update
Dhanush

Dhanush

Dhanush: తమిళ్ స్టార్ ధనుష్  తన 52వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను  'ఇడ్లీ కడై' అనే టైటిల్ తో ప్రకటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం దర్శకుడిగా వహిస్తున్నారు.  ధనుష్ సొంత బ్యానర్ వండర్‌బార్ ఫిల్మ్స్‌, డాన్ పిక్చర్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ధనుష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.  ఇప్పటికే ధనుష్  స్వీయ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన  యాక్షన్ ఎంటర్ టైనర్ 'రాయన్'  బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇందులో ధనుష్ తో పాటు టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. 

 'ఇడ్లీ కడై'.. పోస్టర్

 

ఇది ఇలా ఉంటే ఈ ఏడాది ప్రారంభంలో ధనుష్ ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయకుండా నిర్మాతల నుంచి అడ్వాన్స్‌లు తీసుకున్నందుకు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్  నుంచి తాత్కాలిక నిషేధాన్ని ఎదుర్కొన్నారు. దీంతో ధనుష్ కొంతమంది నిర్మాతలకు  డబ్బు తిరిగి చెల్లించడానికి, మరికొంతమందితో  కలిసి పనిచేయడానికి అంగీకరించారు. ఆ తర్వాత ఆయన పై నిషేధం ఎత్తివేశారు. నిషేధం ఎత్తేసిన తర్వాత ధనుష్ అనౌన్స్ చేసిన తొలి తమిళ్ ఫిల్మ్ 'ఇడ్లీ కడై'. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న 'కుబేర' చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా మరో కీలక పాత్రను పోషించగా..  కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటిస్తోంది. 

Also Read: Tirumala Laddu: ఇంత దారుణమా! లడ్డూ వివాదం పై పవన్ హీరోయిన్ ఆగ్రహం

Advertisment
Advertisment
తాజా కథనాలు