/rtv/media/media_files/2025/12/17/hebah-patel-2025-12-17-15-25-46.jpg)
Hebah Patel
Hebah Patel: పవర్ ఫుల్ నటుడు బాబీ సింహా, అందాల నటి హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త సినిమా అధికారికంగా ప్రారంభమైంది. మెహర్ యరమతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యువ కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 16న పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అయింది.
ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ క్లాప్ కొట్టగా, వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తనికెళ్ల భరణి స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందించారు. ఈ కార్యక్రమానికి సినిమా యూనిట్ మొత్తం హాజరైంది. లాంచ్ ఈవెంట్ చాలా సంతోషంగా, ఉత్సాహంగా జరిగింది.
ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సూర్య శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను జి. కృష్ణ దాస్ నిర్వహిస్తున్నారు. సంగీతాన్ని సిద్ధార్థ సదాశివు అందిస్తుండగా, ఆర్ట్ డైరెక్టర్‌గా వివేక్ అన్నామలై పనిచేస్తున్నారు. అనుభవం ఉన్న టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు పని చేయడం వల్ల అంచనాలు పెరుగుతున్నాయి.
Hebah Patel Producer SKN Viral Video
Anna eywwww @SKNonline
— PITHAPURAM NAIDU❤️🔥🦁 (@_Cultkalyanfan) December 16, 2025
pic.twitter.com/t2oPXS6Esc
లాంచ్ ఈవెంట్‌లో హెబ్బా పటేల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె చూపులు, స్టైల్ అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. అయితే హెబ్బా పటేల్, నిర్మాత ఎస్‌కేఎన్(Producer SKN) ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా ఆ దృశ్యాలు కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తూ వీడియోను షేర్ చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత యువ కృష్ణ మాట్లాడుతూ, “దర్శకుడు మెహర్ నా మంచి స్నేహితుడు. ఈ సినిమా కోసం చాలా కథలు విన్నాను. కానీ మెహర్ చెప్పిన కథ నాకు వెంటనే నచ్చింది. ఈ కథలో మంచి బలం ఉంది, నటనకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ కథ విన్న వెంటనే బాబీ సింహ గారే నాకు గుర్తొచ్చారు. ఆయన బిజీగా ఉన్నా కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. నిర్మాతగా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను బాగా తెరకెక్కిస్తాం” అని చెప్పారు.
దర్శకుడు మెహర్ మాట్లాడుతూ, “ఇది నా మొదటి సినిమా. మీ అందరి ఆశీస్సులు, సపోర్ట్ కావాలి. నా టీమ్ అందరికీ ధన్యవాదాలు” అని తెలిపారు. బలమైన కథ, మంచి నటులు, అనుభవం ఉన్న టెక్నికల్ టీమ్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని చిత్ర బృందం వెల్లడించింది.
Follow Us