HBD Pawan Kalyan: హ్యాపీ బర్త్ డే మామ.. పవన్ కళ్యాణ్ కోసం అల్లు అర్జున్ అదిరిపోయే విషెస్ !

నేడు ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ తారలు, ప్రముఖులు నుంచి పవన్ కళ్యాణ్ కి విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

New Update
allu arjun

allu arjun

HBD Pawan Kalyan: నేడు ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ తారలు, ప్రముఖులు నుంచి పవన్ కళ్యాణ్ కి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా అంతా పవన్ ఫ్యాన్స్ బర్త్ డే వీడియోలు, పోస్టర్లతో నిండిపోయింది. ఈ క్రమంలో తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన మామ పవర్ స్టార్ కి బ్యూటిఫుల్ విషెస్ తెలియజేశారు. ''పవర్ స్టార్, డిప్యూటీ సీఎంకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు'' అంటూ ట్వీట్ చేశారు. ఏపీ ఎన్నికల్లో పవన్ ని కాదని అల్లు అర్జున్ వైసీపీకి పార్టీ నాయకుడు శిల్పా రవి తరపున ప్రచారం చేయడం సంచలనం సృష్టించింది. దీంతో అల్లు అర్జున్- మెగా హీరోల మధ్య విబేధాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. ఇది మాత్రమే కాదు మెగా హీరోలు అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేశారని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ పోస్ట్ తో ఈ పుకార్లన్నింటికీ చెక్ పడింది. 

అల్లు అర్జున్ తో మెగా హీరోలంతా పవన్ కళ్యాణ్ కి ఎక్స్ వేదికగా తమ స్పెషల్ విషెస్ తెలియజేశారు. వరుణ్ తేజ్ తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చాడు..  పుట్టినరోజు శుభాకాంక్షలు, బాబాయ్! మీ ప్రయాణం, మీ విలువలు నాకు ప్రతిరోజూ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. మీరు చేసిన,  చేస్తున్న ప్రతిదానికీ ధన్యవాదాలు! నా OG ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను.  

సాయి ధరమ్ తేజ్.. నాకు పట్టుదల నేర్పించి, నాలో ఆత్మవిశ్వసాన్ని నింపిన నా గురువు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకంక్షలు అని ట్వీట్ చేశాడు. అలాగే చిరంజీవి కూతురు సుష్మిత బాబాయికి బర్త్ డే విషెష్ తెలిపింది. బాబాయి మీరు నాకు అత్యంత శక్తివంతమైన ప్రేరణగా నిలిచారు! నా OG కి పుట్టినరోజు శుభాకాంక్షలు! అని ట్వీట్ చేసింది. 

Advertisment
తాజా కథనాలు