Harsha sai: ఎవరీ హర్ష సాయి? యూట్యూబ్ లో ఇన్ని మిలియన్ల ఫాలోవర్లా..!

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై లైంగిక ఆరోపణలు రావడం హాట్ టాపిక్ గా మారింది. అసలు హర్ష సాయి ఎవరు..? యూట్యూబ్ లో అతను ఎలా పాపులర్ అయ్యాడు..? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update

Harsha sai: అందరూ డబ్బులు సంపాదించడానికి యూట్యూబ్ వీడియోలు చేస్తే .. కానీ హర్ష సాయి మాత్రం డబ్బులను పంచుతూ వీడియోలు చేసేవాడు. తన యూట్యూబ్ మనీతో పేద వారికీ లక్షల రూపాయలు సాయం చేయడం, తన సబ్ స్క్రైబర్ల కోసం ఏకంగా ఫ్రీ పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడం వంటి పనులు చేస్తూ అతి తక్కువ సమయంలోనే ఫుల్ పాపులర్ అయ్యాడు.

2018లో యూట్యూబర్ గా కెరీర్ 

2018లో యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన హర్ష సాయి మొదటగా లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్ కు సంబంధించిన వీడియోలు చేసేవాడు. ఆ తర్వాత రూట్ మార్చిన హర్ష సామజిక సేవ చేయడం మొదలు పెట్టాడు.
పేదవారికి సాయం చేయడం, రోడ్డు పై దీన పరిస్థితిలో కనిపించిన వారికి కొంత డబ్బులు ఇవ్వడం, పిల్లలకు స్కూల్ ఫీజ్ కట్టడం వంటివి చేశాడు. అలా తాను సహాయం చేసిన వీడియోలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో అతనికి చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు.

మిలియన్ల ఫాలోవర్లు 

క్రమంగా యూట్యూబ్ లో హర్ష సాయి ఫాలోవర్ల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అతనికి యూట్యూబ్ లో 10.9 మిలియన్ సబ్ స్క్రైబర్ల ఉన్నారు. అవసరాన్ని బట్టి తన సబ్ స్క్రైబర్లకు, పేదవారికి లక్షలు దానం చేస్తుంటాడు. సహాయం చేయడమే కాదు తన వీడియోలతో జనాలను సర్ ప్రైజ్ లతో ముంచెత్తుతాడు. కామెంట్స్ లో తన సబ్ స్క్రైబర్ల ఏదైనా అడగ్గానే.. వారి కోరికలను తీర్చి సర్ ప్రైజ్ చేస్తుంటాడు.

ఇతను యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయగానే మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చిపడుతుంటాయి. ముఖ్యంగా వీడియోస్ లో హర్ష సాయి వాయిస్ అందరినీ ఆకర్షిస్తుంది. ఇతడు తన ఛానెల్ ద్వారా వచ్చిన డబ్బును మళ్ళీ తాను చేసే పనులకు ఖర్చు పెడుతుంటాడు. ఎంతో మంది పేదవారికి లక్షల కొద్ది సహాయం చేసి నెట్టింట దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్నాడు.

ఒకసారి అయితే కొంతమంది పిల్లలు ఓ కాస్ట్లీ హోటల్ లోకి వెళితే వారిని బయటకు పంపడం చూసిన హర్ష సాయి.. ఆ తర్వాత ఆ పిల్లలందరినీ ఓ పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ కు తీసుకెళ్లి అక్కడ భోజనం చేయాలనే వారి కోరికను తీర్చాడు. అప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఇలా సామజిక సేవతో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఇతనిపై లైంగిక ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

బెట్టింగ్ యాప్స్ 

మరో వైపు ఇతనిపై ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసి యూట్యూబ్ లో డబ్బులు సంపాదిస్తున్నాడు అనే విమర్శలు కూడా ఉన్నాయి. దీని వల్ల ఎంతో మంది యూత్ వాటికి బానిసై చనిపోయారని పలువురు యూట్యూబర్లు ఆరోపించారు. అంతేకాదు ఈ బెట్టింగ్ యాప్ ల ద్వారా వచ్చిన డబ్బులతోనే  ప్రజలకు సహాయం చేస్తున్నాడనే వాదనలు కూడా వినిపించాయి. 

Also Read:  రేప్ కేసు విషయంలో ఏం జరిగిందో చెప్పిన హర్ష సాయి..!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి