Cinema Workers: ఫిల్మ్ ఛాంబర్ గుడ్ న్యూస్.. ఆనందంలో సినీ కార్మికులు

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సినీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది.  వేతనాలను  పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో సినీ కార్మికులకు ఉపశమనం లభించింది.

New Update
cinema workers

cinema workers

Cinema Workers: టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా సినీ కార్మికుల వేతనాల పెంపు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సినీ కార్మికులు తన వేతనాలను 30% పెంచాలంటూ షూటింగ్స్ అన్నీ బంద్ పెట్టి సమ్మెకు దిగారు. దీంతో టాలీవుడ్ లో అన్ని సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్ ల షూటింగులు నిలిచిపోయాయి.  దాదాపు 15 రోజులకు పైగా ఈ విషయంపై సినీ కార్మికులు, ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మధ్య వాడివేడి చర్చలు జరిగాయి. ఈ క్రమంలో తాజాగా ఫిల్మ్ ఛాంబర్ సినీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది.   వేతనాలను  పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో సినీ కార్మికులకు ఉపశమనం లభించింది. ఈ నెల 22న కార్మిక శాఖ సమక్షంలో 13 కార్మిక సంఘాలు, నిర్మాతల మధ్య వేతనాల పెంపు పై ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం కార్మికుల వేతనాలను 22.5% పెంచుతూ కొత్త వేతన కార్డును తయారు చేయనున్నట్లు ఫిల్మ్ చాంబర్ వెల్లడించింది. అలాగే ఈ నెల 22 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 22 వరకు 15 శాతం పెంపును  అమలు చేయాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతలకు ఆదేశాలు ఇచ్చింది. సంఘాల వారిగా వేతనాలను సవరిస్తూ నిర్మాతలకు ఆదేశాలను జారీ చేసింది.  జూనియర్ ఆర్టిస్టుల మొత్తం మూడు భాగాలుగా  విభజించారు

మూడు భాగాలుగా

  • 'ఏ' కేటగిరిలో ఉన్నవారికి రోజుకు రూ. 1,420
  • 'బి' కేటగిరిలో ఉన్నవారికి రోజుకు రూ. 1,175
  • 'సి' కేటగిరిలో ఉన్నవారికి రోజుకు రూ. 930

దీంతో పాటు మరికొన్ని నిబంధనలను కూడా తెలిపింది. ఆర్టిస్టులకు షూటింగ్ సమయంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ అందించకపోతే  దానికి తగ్గ ఖర్చులను ఇవ్వాలని  సూచించింది. బ్రేక్ ఫాస్ట్ అందించకపోతే రూ. 70, మధ్యాహ్నం భోజనం అందించకపోతే రూ. 100 అదనంగా చెల్లించాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. అలాగే కాల్ షీట్ రేట్లను కూడా ప్రతిపాదించింది. ఒక కాల్ షీట్‌కు రూ. 1,470 చెల్లించాలని  తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని చేస్తే, ఒక కాల్ షీట్‌. ఇక సగం కాల్ షీట్ కు రూ. 735 ఉంటుంది. దీంతో ఇండస్ట్రీలో చాలా రోజులుగా కొనసాగుతున్న  వేతనాల పెంపు సమస్యకు ఒక పరిష్కారం లభించింది. ఈ వేతన పెంపుతో సినీ కార్మికుల జీవితాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నారు. 

Also Read: Rahul Gandhi: ఎవరు నచ్చకపోతే వాళ్ళను పంపేయొచ్చు..సీఎం, పీఎం 30 రోజుల జైలు బిల్లుపై రాహుల్ విమర్శ

Advertisment
తాజా కథనాలు