Emmy Awards 2025: ఎమ్మీ బరిలో టాప్ షోలు ఇవే .. సెవరెన్స్, పెంగ్విన్ సంచలనం !

ప్రపంచ సినీ ప్రియులు, నటీనటులు  ఆసక్తిగా ఎదురుచూసే 'ఎమ్మీ అవార్డ్స్ 2025 నామినేషన్లను' ( 'Emmy Awards Nominations 2025) ప్రకటించారు. ఈ సంవత్సరం నామినేషన్లలో టీవీ షోలు, అందులోని నటీనటులు సత్తా చాటారు.

New Update

Emmy Awards nominations 2025:    ప్రపంచ సినీ ప్రియులు, నటీనటులు  ఆసక్తిగా ఎదురుచూసే 'ఎమ్మీ అవార్డ్స్ 2025 నామినేషన్లను' ( 'Emmy Awards Nominations 2025) ప్రకటించారు. ఈ సంవత్సరం నామినేషన్లలో టీవీ షోలు, అందులోని నటీనటులు సత్తా చాటారు. అత్యధిక సంఖ్యలో నామినేషన్లు పొందారు. ముఖ్యంగా కొన్ని షోలు 20కి పైగా  నామినేషన్లతో దూసుకుపోయాయి. నామినేషన్ల ఫుల్ లిస్ట్ ఇక్కడ చూద్దాం. 

'సెవరెన్స్' ఆధిపత్యం 

'సెవరెన్స్' (Severance) అనే సైకలాజికల్ వర్క్‌ప్లేస్ డ్రామా షో ఏకంగా 27 నామినేషన్లతో టాప్ ప్లేస్ లో నిలిచింది.  ఆడమ్ స్కాట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ టీవీ సీరీస్ యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది.  ఆ తర్వాత 'ది పెంగ్విన్' (The Penguin) సిరీస్ 24 నామినేషన్లు సాధించి, రెండవ స్థానంలో నిలిచింది. అలాగే  యాపిల్ టీవీ+ రూపొందించిన  'ది స్టూడియో',  'ది వైట్ లోటస్'  షోలు కూడా చేరి 23 నామినేషన్లతో బలమైన పోటీనిచ్చాయి.

 మంగళవారం రాత్రి ఈ 77వ ఎమ్మీ అవార్డుల నామినేషన్లను ప్రకటించారు. మొదట రియాలిటీ షోలు, టాక్ షో కేటగిరీల నామినేషన్లను తెలియజేశారు. ఆ తర్వాత నటీనటుల నామినేషన్లను వెల్లడించారు. 

ఉత్తమ డ్రామా సిరీస్‌ నామినేషన్లు

  • ది డిప్లొమాట్ (The Diplomat)

  • ది లాస్ట్ ఆఫ్ అజ్ (The Last of Us)

  • ప్యారడైజ్ (Paradise)

  • ది పిట్ (The Pitt)

  • సెవరెన్స్ (Severance)

  • స్లో హార్సెస్ (Slow Horses)

  • ది వైట్ లోటస్ (The White Lotus)

ఉత్తమ నటుడు నామినేషన్లు:

  • స్టెర్లింగ్ కె. బ్రౌన్ (ప్యారడైజ్ కోసం)

  • గ్యారీ ఓల్డ్‌మాన్ (స్లో హార్సెస్ కోసం)

  • పెడ్రో పాస్కల్ (ది లాస్ట్ ఆఫ్ అజ్ కోసం)

  • ఆడమ్ స్కాట్ (సెవరెన్స్ కోసం)

  • నోహ్ వైల్ (ది పిట్ కోసం)

ఉత్తమ నటి నామినేషన్లు

  • కేథీ బేట్స్ (మాట్‌లాక్ కోసం)

  • షారన్ హార్గాన్ (బ్యాడ్ సిస్టర్స్ కోసం)

  • బ్రిట్ లోవర్ (సెవరెన్స్ కోసం)

  • బెల్లా రామ్సే (ది లాస్ట్ ఆఫ్ అజ్ కోసం)

  • కెరీ రస్సెల్ (ది డిప్లొమాట్ కోసం)

Also Read: Cinema: ఛీ ఇదేం రోగం.. నగ్నంగా ఫొటో షూట్ రిలీజ్ చేసిన మేఘా !

Advertisment
Advertisment
తాజా కథనాలు