/rtv/media/media_files/B7G0S4gvCNcIlnnCaXch.jpg)
Emmy Awards 2024
Emmy Awards 2024 Winners: 76వ ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డ్స్ 2024 లో హాలీవుడ్ సిరీస్ ‘ది బేర్’ సెకండ్ సీజన్ రికార్డు క్రియేట్ చేసింది. 23 నామినేషన్లతో ఎమ్మీ చరిత్రలో .. ఇప్పటివరకు అత్యధికంగా నామినేట్ చేయబడిన కామెడీ సీరీస్ గా నిలిచింది. బెస్ట్ డ్రామాస్ విభాగంలో ‘షోగన్’ ఫిల్మ్ 25 నామినేషన్లతో సత్తా చాటింది. ఈ 25 నామినేషన్స్ లో సినిమాలో నటించిన సవాయి, హిరోయుకి సనాడా, తడనోబు అసనో, తకేహిరో హీరా, నెస్టర్ కార్బోనెల్‌లు నటులు కూడా అవార్డుకు ఎంపికయ్యారు. అంతే కాదు గత వారం జరిగిన క్రియేటివ్ ఆర్ట్స్ ఎమ్మీ అవార్డ్స్ లోనూ ‘షోగన్’ 14 అవార్డులను సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది.
వీటితో పాటు ‘ది క్రౌన్’ సీరీస్ లాస్ట్ సీజన్ 18 నామినేషన్లను అందుకుంది. అలాగే డొనాల్డ్ గ్లోవర్, మాయా ఎర్స్‌కిన్ నటించిన ‘ఫాల్అవుట్’, ‘మిస్టర్ & మిసెస్ స్మిత్’ వంటి కొత్త సీరీస్ లు ఒక్కొక్కటి 16 నామినేషన్లను పొందాయి. జెరెమీ అలెన్ వైట్ ‘ది బేర్’ కామెడీ సీరీస్ కు గానూ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. ‘ది క్రౌన్‌లో’ ప్రిన్సెస్ డయానా పాత్రకు గానూ ఎలిజెబెత్ డెబిక్కీఉత్తమ సహాయ నటిగా ఎమ్మీ అవార్డు పొందింది.
క్రియేటివ్ ఆర్ట్స్ ఎమ్మీ అవార్డ్స్ విజేతలు
ఉత్తమ అతిథి నటి (కామెడీ సీరీస్): జామీ లీ కర్టిస్ (ది బేర్)
ఉత్తమ అతిథి నటుడు (కామెడీ సీరీస్): జోన్ బెర్న్తాల్ (ది బేర్)
ఉత్తమ అతిథి నటి ( డ్రామా సీరీస్): మైఖేలా కోయెల్ (మిస్టర్ & మిసెస్ స్మిత్)
ఉత్తమ అతిథి నటుడు ( డ్రామా సీరీస్): నెస్టర్ కార్బోనెల్ (షగున్)
The #Emmy for Outstanding Lead Actor in a Comedy Series goes to Jeremy Allen White for @TheBearFX (@FXNetworks/@Hulu). Congratulations! 🤩 #76thEmmys #Emmys #TelevisionAcademy pic.twitter.com/AcD70WAmOT
— Television Academy (@TelevisionAcad) September 16, 2024
Emmy Awards 2024 Winners
- ఉత్తమ సహాయ నటుడు (డ్రామా): బిల్లీ క్రుడప్ ( మార్నింగ్ షో)
- ఉత్తమ సహాయ నటుడు (కామెడీ సీరీస్): ఎబోన్ మోస్-బచ్రాచ్ (ది బేర్)
- బెస్ట్ లీడ్ యాక్టర్ (కామెడీ సీరీస్): రెమీ అలెన్ వైట్ (ది బేర్)
- ఉత్తమ సహాయ నటి (డ్రామా సీరీస్ ): లిజా కోలోన్-జయాస్ (ది బేర్)
- ఉత్తమ సహాయ నటి (డ్రామా సీరీస్ ): ఎలిజబెత్ డెబికి (ది క్రౌన్)
- ఉత్తమ సహాయ నటి (కామెడీ సీరీస్): జీన్ స్మార్ట్ (హ్యాక్స్)
- ఉత్తమ రియాలిటీ ప్రోగ్రామ్: ది ట్రెయిటర్స్ (The Traitors)
- ఉత్తమ సహాయ నటి (ఆంథాలజీ సిరీస్): జెస్సికా గన్నింగ్ ( బేబీ రెయిన్ డీర్)
- ఉత్తమ కథా సీరీస్: (లాస్ట్ వీక్ టునైట్ విత్ జాన్ ఆలివర్)
- ఉత్తమ రచన : అలెక్స్ ఎడెల్మాన్ (అలెక్స్) ఎడెల్మాన్ (జస్ట్ ఫర్ అస్)
- ఉత్తమ దర్శకుడు (ఆంథాలజీ సిరీస్, మూవీ): స్టీవెన్ జైలియన్ రిప్లే(Ripley)
- ఉత్తమ రచయిత ( కామెడీ సీరీస్): లూసియా అనియెల్లో, పాల్ W డౌన్స్, జెన్ స్టాట్స్కీ ( హ్యాక్స్)
- ఉత్తమ టాక్ సీరీస్: ది డైలీ షో
Outstanding Supporting Actress in a Comedy Series #Emmy winner Liza Colón-Zayas pic.twitter.com/VB7pAIpqr1
— Television Academy (@TelevisionAcad) September 16, 2024
Also Read: johnny master: జానీ మాస్టర్ తో టార్చర్.. రేప్ కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్! – Rtvlive.com