Kaantha Trailer: గురు - శిష్యుల అహంకార పోరాటం.. ‘కాంత’ ట్రైలర్‌ విడుదల!

దుల్కర్ సల్మాన్, సముద్రకని నటించిన “కాంత” ట్రైలర్‌ ఆకట్టుకుంది. గురువు-శిష్యుల అహంకార ఘర్షణపై సాగే ఈ కథలో భగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా, రాణా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపిస్తున్నారు. పీరియడ్‌ డ్రామా నేపథ్యంతో ఈ మూవీ రూపొందుతుంది.

New Update

Kaantha Trailer: దుల్కర్‌ సల్మాన్‌(Dulquer Salmaan), సముద్రకని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కాంత’ (Kaantha) సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఈ పీరియడ్‌ డ్రామా చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. హీరోయిన్‌గా భగ్యశ్రీ బోర్స్ నటిస్తోంది. ట్రైలర్‌ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాకు బలమైన బేస్‌ అందించింది. కథలో గురువు - శిష్యుల మధ్య అహంకారంతో మొదలైన ఘర్షణ ప్రధానాంశంగా కనిపిస్తోంది. సముద్రకని గురువు పాత్రలో, దుల్కర్‌ సల్మాన్‌ ఆయన శిష్యుడిగా నటిస్తున్నారు.

ట్రైలర్‌ మొదటి నుంచే కథలోని ప్రధాన సన్నివేశాలపై దృష్టి పెట్టింది. “మోడర్న్ పిక్చర్స్” అనే బ్యానర్‌ కింద తెరకెక్కుతున్న ‘శాంత’ అనే హారర్‌ సినిమా కథలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆ సినిమాలో దర్శకుడిగా ఉన్న అయ్యా (సముద్రకని)ను పక్కన పెట్టి, హీరో టి.కె. మహాదేవ (దుల్కర్‌ సల్మాన్‌) స్వయంగా దర్శకుడిగా బాధ్యతలు తీసుకుంటాడు. ఇది గురువు - శిష్యుల మధ్య ఉన్న అహంకారాన్నీ చూపిస్తుంది.

హీరోయిన్ కుమారి (భగ్యశ్రీ బోర్స్) మాత్రం తన దర్శకుడు అయ్యా పట్ల విశ్వాసంగా ఉంటూ, ఆయన చెప్పిన సూచనలనే పాటిస్తుంది. దీని వల్ల సెట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతాయి. ఇంతలో ఒక పోలీస్‌ ఆఫీసర్‌ (రాణా దగ్గుబాటి) ఎంట్రీతో కథలో కొత్త మలుపు వస్తుంది.

ఈ కథలో ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తుతాయి - గురువు, శిష్యుల మధ్య విభేదానికి కారణం ఏమిటి? “శాంత” సినిమా ఎందుకు “కాంత”గా మారింది? ఒక శిష్యుడు తన గురువుకు వ్యతిరేకంగా ఎందుకు తిరిగాడు? ఈ ప్రశ్నలకే సినిమా సమాధానమని ట్రైలర్‌ చూపిస్తుంది.

ట్రైలర్‌లో ప్రతి షాట్‌కి నాటకీయత, భావోద్వేగం బాగా కనిపిస్తున్నాయి. దుల్కర్‌ సల్మాన్‌,  సముద్రకని మధ్య సీన్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. సెట్స్‌, పీరియడ్‌ బ్యాక్‌డ్రాప్‌, సంగీతం అన్ని సినిమాకి ఒక స్పెషల్‌ ఫీల్‌ ఇస్తున్నాయి.

రాణా దగ్గుబాటి పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించడం కూడా ట్రైలర్‌లో సర్ప్రైజ్‌ ఎలిమెంట్‌గా నిలిచింది. ఆయన పాత్ర సినిమాకి కీలకం కానుందని తెలుస్తోంది.
మొత్తం మీద, ‘కాంత’ ట్రైలర్‌ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. గురువు-శిష్యుల మధ్య ఉన్న అహంకార యుద్ధం, భావోద్వేగాలు, మానవ సంబంధాలు అన్ని ఈ సినిమాను ఒక వేరే స్థాయికి తీసుకెళ్లేలా ఉన్నాయి. ఇప్పుడు అందరి చూపు సినిమా విడుదల తేదీపై ఉంది.

Advertisment
తాజా కథనాలు