Venu Yellamma: వేణు ‘ఎల్లమ్మ’లో ఊహించని హీరో.. ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడంటే..?

దర్శకుడు వేణు కొత్త సినిమా ‘ఎల్లమ్మ' ఫస్ట్ గ్లింప్స్ జనవరి 15న రిలీజ్ అవుతుంది. మొదట నాని, తర్వాత నితిన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత హీరో పై క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. దిల్ రాజు బ్యానర్‌లో కొత్త స్టోరీతో వస్తున్న ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

New Update
Venu Yellamma

Venu Yellamma

Venu Yellamma: సూపర్‌హిట్ ‘బలగం’ తర్వాత దర్శకుడు వేణు కొత్త సినిమా ‘ఎల్లమ్మ’ను అనౌన్స్ చేశారు. మొదట ఈ ప్రాజెక్ట్‌లో నాని నటించాల్సి ఉండగా, ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత నితిన్ను హీరోగా కన్‌ఫర్మ్ చేసారు, కానీ అనుకోని కారణాల వల్ల నితిన్ కూడా బయటకు వచ్చేశారు. దీనితో అసలు ఈ సినిమాలో హీరో ఎవరన్నదానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో గుసగుసలు వినిపిస్తున్నాయి.

వీటన్నిటి మధ్య ‘ఎల్లమ్మ’ చిత్రబృందం జనవరి 15న సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫస్ట్ గ్లింప్స్ ద్వారా సినిమా స్టోరి, స్క్రీన్ లుక్, విజువల్స్ పై కొంత స్పష్టత ఏర్పడనుంది. తర్వాత హీరో, హీరోయిన్ ఎవరన్నది కొంత రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఫస్ట్ ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే, కీర్తి సురేష్ ఆ ఫిల్మ్‌లో లేరని స్పష్టం చేసింది. కాబట్టి హీరోయిన్‌ను ఎవరూ నటిస్తారో ఇంకా అధికారికంగా తెలుపలేదు

ఈ ప్రాజెక్ట్‌ను దిల్ రాజు, సిరీష్ Sri Venkateswara Creations బ్యానర్‌ కింద నిర్మిస్తున్నారని ఫిల్మ్ మేకర్స్ తెలిపారు. దర్శకుడు వేణు బాలగంతో సూపర్‌హిట్ రికార్డు సాధించిన తర్వాత ఈ సినిమా కూడా ప్రేక్షకులకు విభిన్నమైన, నూతన అనుభూతిని అందిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

ప్రేక్షకులు ఇప్పుడు జనవరి 15న విడుదలయ్యే గ్లింప్స్ కోసం  ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు విడుదల కానున్న ఫస్ట్ గ్లింప్స్ ద్వారా సినిమా లుక్, టోన్, ప్రధాన పాత్రలపై మొదటి స్ఫష్టత లభిస్తుంది. 

తదుపరి కథనం, హీరో-హీరోయిన్ ఎవరన్నది ఫస్ట్ గ్లింప్స్తో కొంత వెలుగులోకి వస్తుందని ఫిల్మ్ అభిమానులు ఆశిస్తున్నారు. ‘ఎల్లమ్మ’ చిత్రంలో కొత్త కథ, శక్తివంతమైన విజువల్స్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని మేకర్స్ అభిప్రాయపడ్డారు.

Advertisment
తాజా కథనాలు