/rtv/media/media_files/2025/09/17/bigg-boss-suman-shetty-2025-09-17-15-02-50.jpg)
bigg boss suman Shetty
Suman Shetty: దర్శకుడు తేజ ఎంతో మంది కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన పరిచయం చేసిన చాలా మంది హీరోలు, యాక్టర్లు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్లుగా రాణిస్తున్నారు. అలంటి వారిలో కమెడియన్ సుమన్ శెట్టి ఒకరు. నటనపై అతడికి ఉన్న ఆసక్తి, టాలెంట్ ని గుర్తించి తన సినిమాలో అవకాశం కల్పించారు తేజ. 'జయం' సినిమా ద్వారా సుమన్ శెట్టిని తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు! ఈ సినిమా సుమన్ శెట్టికి కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చింది. ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మొదటి సినిమాతోనే నంది అవార్డు కూడా వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత సుమన్ శెట్టి జీవితమే మారిపోయింది. వరుస అవకాశాలతో కెరీర్ లో బిజీ అయిపోయారు. 'జయం' తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన 'జై', 'సంబరం', 'ఔనన్నా కాదన్నా', 'నిజం' వంటి పలు సినిమాల్లో సుమన్ శెట్టికి తేజ అవకాశాలిచ్చారు.
పలు సూపర్ హిట్ సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుమన్ శెట్టి.. ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా అలరిస్తున్నారు. హౌజ్ లో సుమన్ శెట్టి పెద్దగా ఆడకపోయినప్పటికీ .. అతడి జెన్యూన్ నేచర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ తేజ సుమన్ శెట్టి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'జయం' తర్వాత వరుస సినిమాల అవకాశాలు రావడంతో సుమన్ కి కొంచెం డబ్బులు వచ్చాయి. దీంతో తేజ ఎక్కడైనా సైట్ కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకోమని సుమన్ కి సలహా ఇచ్చారట. తేజ్ చెప్పినట్లుగానే సుమన్ ఒక ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ చేశారట.
ప్రస్తుత బిగ్ బాస్ 9 లో సుమన్ శెట్టి గారి గురుంచి డైరెక్టర్ తేజ మాటలు. ఇది చూసాక 2 ఎపిసోడ్స్ ఆయన కోసం చూసా. నాలాగా ఇంత అమాయకంగా, మంచోడిలా ఉన్నాడు ఏంటిరా అనుకున్న 🙏🏻
— Vennela Kishore Reddy (@Kishoreddyk) September 17, 2025
ఈరోజు ఈ వీడియో చూడగానే అర్థం అయింది. సుమన్ శెట్టి జెన్యూన్ గా ఆడుతున్నాడు అని. #SumanShetty#BigBossTelugu9pic.twitter.com/v2cQ4d89ku
తేజ కోసం అలా
అయితే ఇల్లు కట్టుకునే ముందు తేజ దగ్గరికి వెళ్లి.. ఆయన కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం కావాలని అడిగారట. అప్పుడు డైరెక్టర్ తేజ ఇలా ఏమీ చేయొద్దు! నేను ఇలాగే కొత్త వాళ్ళతో సినిమాలు చేసి చేసి ఏదో ఒక రోజు రోడ్డుపైకి వస్తాను.. అప్పుడు నేను ఉండడానికి నీ ఇంట్లో ఒక రూమ్ కట్టించి ఉంచు అని సరదాగా చెప్పారట. కానీ, సుమన్ శెట్టి నిజంగానే తేజ కోసం తన ఇంట్లో ఒక కట్టించి.. ఆ గదిలో ఆయన ఫొటో పెట్టి ఉంచారట. ఇప్పటికీ రూమ్ ని క్లీన్ చేయిస్తూ ఉంచుతారట అంటూ సుమన్ శెట్టి అభిమానం, మంచి తనం గురించి చెప్పుకొచ్చారు తేజ. అలాగే బిగ్ బాస్ హౌజ్ లో చాలా జెన్యూన్ గా ఆడుతున్నడని చెప్పారు.
Also Read: MY MODI STORY: మోదీకి అదిరిపోయే బర్త్‌డే విషెస్.. పవన్, చిరు, మహేష్, ఎన్టీఆర్ ఏమన్నారంటే..?