/rtv/media/media_files/2026/01/13/director-maruthi-2026-01-13-19-23-39.jpg)
Director Maruthi
Director Maruthi: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), దర్శకుడు మారుతి కాంబినేషన్ గురించి గత కొంతకాలంగా టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. మారుతి చిరంజీవికి పెద్ద అభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నోసార్లు బహిరంగ వేదికలపై చిరంజీవితో సినిమా చేయడం తన జీవిత కల అని మారుతి చెప్పుకొచ్చారు. ఆ కల నిజమయ్యే అవకాశం కూడా ఒకసారి తన దగ్గరకు వచ్చింది.
చిరంజీవి - మారుతి మధ్య ఒక దశలో కథ చర్చలు కూడా జరిగాయి. ఆ సమయంలో చిరంజీవి కథపై ఆసక్తి చూపించారన్న టాక్ వినిపించింది. ఇద్దరి ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తయ్యాక సినిమా ప్రారంభించాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక అప్‌డేట్ రాలేదు. దీంతో ఈ కాంబినేషన్ నిజమవుతుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి.
తాజాగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజా సాబ్’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. మొదటి రోజు ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా రెండవ రోజుకు టాక్ మొత్తం మారిపోయింది. అయితే కొంత మంది అభిమానులు మాత్రం రాజాసాబ్ సినిమాతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మారుతీ చిరంజీవితో సినిమా చేసే అవకాశం మరింత ఆలస్యం అవుతుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మారుతి స్పందిస్తూ, తాను త్వరలోనే చిరంజీవితో సినిమా చేయబోతున్నానని చెప్పారు. ఈ మాటతో మళ్లీ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే… ఈ దశలో చిరంజీవి మారుతిపై నమ్మకం పెట్టుకుంటారా అన్నదే.
అయినా చిరంజీవి లాంటి స్టార్ హీరో విషయంలో ప్రతి ప్రాజెక్ట్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు బాబీతో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత శ్రికాంత్ ఓదెలతో మరో సినిమా చేయడానికి ఇప్పటికే కమిట్ అయ్యారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యే సరికి కనీసం వచ్చే ఏడాది వరకు సమయం పడే అవకాశం ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో మారుతి ప్రాజెక్ట్ వెంటనే మొదలయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మారుతి ఈ గ్యాప్‌లో మరో సినిమా చేసి, బలమైన కంబ్యాక్ ఇస్తే పరిస్థితి మారే అవకాశం ఉంది. ఒక బలమైన హిట్ పడితే చిరంజీవి - మారుతి కాంబినేషన్‌పై ఫ్యాన్స్ కు నమ్మకం మరింత పెరుగుతుంది.
మొత్తానికి, ఈ కాంబినేషన్ జరగాలంటే కొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. మారుతి తనను తాను మరోసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. చిరంజీవి అభిమానులు మాత్రం ఈ ఇద్దరి కలయిక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.
Follow Us