Lokesh Kanagaraj DC:  ఖైదీ, మాస్టర్, విక్రమ్, కూలీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. ఇప్పుడు హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. గత కొద్దిరోజులుగా లోకేష్ హీరోగా పరిచయం కాబోతున్నారు అంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే వార్తలను నిజం చేస్తూ.. సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. తాజాగా మూవీ టైటిల్ టీజర్ విడుదల చేశారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  'డీసీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. టీజర్ లో లోకేష్ ఒంటినిండా రక్తంతో.. నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ హైలైట్ గా నిలిచాయి. పాత్రల ఆధారంగా సినిమా టైటిల్స్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో హీరో లోకేష్ దేవదాస్ పాత్రలో కనిపిస్తుండగా.. నటి వామికా గబ్బి చంద్ర అనే పాత్రలో నటిస్తోంది. 
LokeshKanagaraj looking perfect Hero Material in #DC🔥
— AmuthaBharathi (@CinemaWithAB) November 1, 2025
Going to be a good outing for him before starting #Kaithi2 under his Directorial. He will focus on script writing in the Gap🤝 pic.twitter.com/v0fwotdS38
తొలిసారి వెండితెరపై
టీజర్ చూస్తుంటే.. ఇదొక యాక్షన్ డ్రామా లేదా గ్యాంగ్ స్టార్ కథాంశంతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ రక్తంతో తడిసిన కత్తితో, రఫ్ లుక్‌లో ఆయన కనిపించారు. టీజర్ లో అనిరుధ్ అందించిన 'Ain't Nobody' అనే థీమ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో లోకేష్ తొలిసారి హీరోగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటివరకు డైరెక్టర్ గా మెప్పించిన లోకేష్.. హీరోగా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Also Read: Dadasaheb Phalke Awards 2025: ప్రభాస్ 'కల్కి' చిత్రానికి మరో అరుదైన గౌరవం! అవార్డుల ఫుల్ లిస్ట్ ఇదే
 Follow Us