/rtv/media/media_files/2025/10/04/pop-singer-2025-10-04-06-37-45.jpg)
అమెరికన్ పాప్ సింగర్, హిప్-హాప్ దిగ్గజం సీన్ డిడీ కాంబ్స్ (Sean 'Diddy' Combs) కు నాలుగేళ్ల, రెండు నెలల (4 సంవత్సరాల 2 నెలలు) జైలు శిక్ష పడింది. వివిధ రాష్ట్రాల గుండా ప్రజలను లైంగిక కార్యకలాపాల కోసం రవాణా చేసిన కేసులో జూలైలో దోషిగా నిర్ధారించబడిన తర్వాత ఆయనకు ఈ శిక్షను విధించారు. ఈ నేరం ఫెడరల్ మాన్ చట్టం కిందకు వస్తుంది. 55 ఏళ్ల కాంబ్స్ ఇప్పటికే దాదాపు ఒక సంవత్సరం జైలులో ఉన్నారు కాబట్టి, ఆ సమయాన్ని తగ్గించిన తర్వాత, ఆయన ఇంకా మూడు సంవత్సరాల వరకు జైలులో ఉండాల్సి రావచ్చు. అయితే, ఆయనపై నమోదైన సెక్స్ ట్రాఫికింగ్, రాకెటీరింగ్ వంటి తీవ్రమైన నేరాల నుంచి జ్యూరీ నిర్దోషిగా ప్రకటించింది, లేకుంటే ఆయనకు జీవిత ఖైదు పడే అవకాశం ఉండేది. జైలు శిక్షతో పాటు, కోర్టు ఆయనకు గరిష్టంగా $500,000 (ఐదు లక్షల డాలర్లు) జరిమానా కూడా విధించింది.
⚖️ Sean “Diddy” Combs Sentenced
— Therook (@MrRookTalk) October 4, 2025
On October 3, 2025, music mogul Sean “Diddy” Combs was sentenced in Manhattan federal court after being convicted on two counts under the Mann Act for transporting individuals across state lines for prostitution-related activities. 🏛️
Prosecutors… pic.twitter.com/KLKMfYlzp6
కోర్టులో విలపించిన డిడీ కాంబ్స్
భారత సంతతి జడ్జి అరుణ్ సుబ్రమణ్యన్ తీర్పును ప్రకటిస్తూ, కాంబ్స్ తన అధికారాన్ని, వనరులను దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. కాంబ్స్ తరఫు న్యాయవాదులు ఈ తీర్పును అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు. అంతకుముందు సీన్ డిడీ కాంబ్స్ పై నమోదైన సెక్స్ ట్రాఫికింగ్ వంటి తీవ్రమైన కేసులు కొట్టేయడంతో జీవిత ఖైదు నుంచి బయటపడ్డారు. ఈ తీర్పు సంగీత పరిశ్రమకు సంబంధించిన ఒక పెద్ద కుంభకోణాన్ని చుట్టుముట్టింది. ఇక శిక్ష విధించే ముందు, డిడ్డీ కోర్టులో విలపిస్తూ, తన శిక్ష కోసం హాజరైన తన తల్లి, పిల్లలతో క్షమాపణలు చెప్పాడు. "నేను చాలా అవమానానికి గురయ్యాను, నా మనసు విరిగిపోయింది. ఇప్పుడు నన్ను నేను ద్వేషిస్తున్నాను. నన్ను ఏమీ లేకుండా చేశారు. వాళ్ళు ఏమి చెప్పినా నాకు నిజంగా బాధగా ఉంది" అని అతను చెప్పి తన ఏడుగురు పిల్లలందరికీ క్షమాపణలు చెప్పాడు, వారి పేర్లను కూడా చెప్పాడు. డ్రగ్స్‌కు బానిసై అలా చేశానని, అందుకు సిగ్గుపడుతున్నట్లు సీన్ కన్నీరు పెట్టుకున్నారు.
రెండు సంవత్సరాల వయస్సులోనే
సీన్ డిడ్డీ కాంబ్స్ 1969 నవంబర్ 4 న న్యూయార్క్ నగరంలోని హార్లెమ్‌లో జన్మించాడు. ఇతని తండ్రి, మెల్విన్ ఎర్ల్ కాంబ్స్, ఇతనికి రెండు సంవత్సరాల వయస్సులోనే హత్య చేయబడ్డాడు. తల్లి జానిస్ కాంబ్స్ (మోడల్ టీచర్స్ అసిస్టెంట్) ఇతనిని న్యూయార్క్‌లోని మౌంట్ వెర్నాన్లో పెంచింది. 1990లలో అప్‌టౌన్ రికార్డ్స్‌లో ఇంటర్న్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, తక్కువ కాలంలోనే టాలెంట్ డైరెక్టర్‌గా ఎదిగాడు. అక్కడ మేరీ జె. బ్లైజ్, జోడెసి వంటి ప్రముఖ కళాకారుల ఎదుగుదలకు తోడ్పడ్డాడు.
Follow Us