/rtv/media/media_files/2025/10/24/dhanush-idli-kottu-ott-2025-10-24-15-14-18.jpg)
Dhanush Idli Kottu Ott
Idli Kottu Ott: హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిత్యామీనన్- ధనుష్ జంటగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ఇడ్లీ కొట్టు' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. 'తిరు' లాంటి బ్లక్ బస్టర్ తర్వాత ధనుష్- నిత్యామీనన్ ఈ సినిమా ఆ రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. యావరేజ్ టాక్ రావడంతో నెలరోజులలోపే ఓటీటీ విడుదలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అక్టోబర్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ పోస్టర్ ను పంచుకుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.
Digital Premiere:
— Shrikrishna (@Shrikrishna_13) October 24, 2025
Kannada Version Of Tamil Film #IdliKadai(2025) Will Premiere On October 29th On @NetflixIndia
Also In Telugu, Malayalam & Hindi #KannadaDubbedpic.twitter.com/RGRL5fthUU
ఇడ్లీ కొట్టు చుట్టూ కథ
ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రాజ్ కిరణ్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఒక గ్రామంలోని ఇడ్లీ కొట్టు చుట్టూ అల్లుకున్న తండ్రీ-కొడుకుల అనుబంధం, మానవ సంబంధాలు, సాంప్రదాయ విలువలు నేపథ్యంలో హార్ట్-టచింగ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ధనుష్ ఇందులో ఇందులో ధనుష్ ఇడ్లీ కొట్టు నడుపుకునే ఒక సాధారణ వ్యక్తి మురళి పాత్రలో నటించారు.
Allu Arjun: మైండ్ బ్లోయింగ్ .. రిషబ్ శెట్టి 'కాంతారా' ను ఆకాశానికెత్తిన అల్లు అర్జున్! పోస్ట్ వైరల్
Follow Us