Devi Sri Prasad: మోదీ ముందు దుమ్ములేపిన దేవి..! వీడియో వైరల్

న్యూయార్క్ నస్సావ్‌ వెటరన్స్‌ కొలస్సియంలో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సు వేదికపై దేవీ శ్రీ ప్రసాద్ తన సంగీతంతో ఆహుతులను ఆకట్టుకున్నారు. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పాటను ఆలపిస్తూ ప్రధాని మోదీని వేదికపైకి ఆహ్వానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

New Update

Devi Sri Prasad: న్యూయార్క్ నస్సావ్‌ వెటరన్స్‌ కొలస్సియంలో ఇటీవలే జరిగిన ప్రవాస భారతీయుల సదస్సు వేడుకలో  టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన సంగీత ప్రదర్శన ఇచ్చారు. దేవితో పాటు ఈ వేడుకలో పై 382 మంది జాతీయ, అంతర్జాతీయ కళాకారులు ప్రదర్శమిచ్చారు. 117 మంది కళాకారులూ తమ అద్భుతమైన కళా ప్రదర్శనలతో ప్రతినిధులకు  స్వాగతం పలికారు. డీఎస్పీ శ్రీవల్లి పాటతో ఆహుతులను ఉర్రూతలూగించారు.  ఆ తర్వాత దేవి ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పాటను ఆలపిస్తూ .. భారత ప్రధాని నరేంద్ర మోదీని వేదిక పైకి ఆహ్వానించారు. అనంతరం మోదీ సంక్షంలోనే పాటను కొనసాగించారు. దేవి పాటకు ఫిదా అయిన మోదీ ప్రేమగా DSP ని ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి. 

మోదీ ముందు దేవి శ్రీ ప్రసాద్ పాట 

Advertisment
తాజా కథనాలు