Demonte Colony 2: ఓటీటీలో భయపెట్టేందుకు వచ్చేసిన 'డెమోంటే కాలనీ'..!

తమిళ్ హీరో అరుల్‌నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ నేచురల్ హర్రర్ 'డెమోంటే కాలనీ2.' తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. ఈరోజు నుంచి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది.

New Update

Demonte Colony 2: తమిళ్ సూపర్ హిట్ 'డెమోంటే కాలనీ' సీక్వెల్ గా రూపొందిన లేటెస్ట్ మూవీ 'డెమోంటే కాలనీ 2'. తమిళ్ హీరో అరుల్‌నిధి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలో గత నెల ఆగస్టు 15న తమిళంలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. సూపర్ నేచురల్ హర్రర్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం 'తంగళన్' వంటి భారీ చిత్రాలకు దీటుగా ప్రేక్షకాదరణ పొందింది. 

 'డెమోంటే కాలనీ 2' ఓటీటీ రిలీజ్ 

తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రియులను కూడా భయపెట్టేందుకు వచ్చేసింది. నేటి నుంచి  'డెమోంటే కాలనీ 2' ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'జీ5' లో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారిని ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది. రాజ్ వర్మ ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ బాలాజీ ఫిలిమ్స్, జ్ఞానముత్తు పట్టరై, వైట్ నైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై విజయ సుబ్రహ్మణ్యం, ఆర్‌సి రాజ్‌కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మీనాక్షి గోవింద్‌రాజన్‌, సరనో ఖాలిద్‌, ఆన్తి జాస్కేలైనెస్‌, సెరింగ్‌ డోర్జీ, అరుణ్‌ పాండియన్‌, ముత్తుకుమార్‌, అర్చన రవిచంద్రన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

  'డెమోంటే కాలనీ 2' తో పాటు ఈ వీకెండ్ ఓటీటీ సినిమాలు 

 ‘ప్రతినిధి 2’

నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ డ్రామా  ‘ప్రతినిధి 2’ ఈరోజు నుంచి 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతోంది. 

 ‘స్త్రీ2’

బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ లేటెస్ట్  సూపర్ హిట్ ఫిల్మ్  ‘స్త్రీ2’ కూడా ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. 

‘లవ్‌ సితార’

శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘లవ్‌ సితార’. ఈ చిత్రం ఈరోజు నుంచి ‘జీ 5’ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

Also Read: HariHaraVeeraMallu: ‘హరిహరవీరమల్లు' కొత్త పోస్టర్.. బంగారు చీరలో మెరిసిపోతున్న నిధి అగర్వాల్‌ - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు